వెస్టిండీస్ టీంలోని ఓ స్టార్ క్రికెటర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. గత వారం గయానాకు చెందిన కైటూర్ న్యూస్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. ఒక టీనేజర్‌తో సహా 11 మంది మహిళలు ఆ క్రికెటర్‌పై లైంగిక నేరాల ఆరోపణలు చేశారు. ఈ అభియోగాలపై ఇంకా కేసు నమోదు కాలేదు. తాజాగా జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం జరగాలని పిలుపునిచ్చారు.
అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు పోలీసులు.. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన…
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై హైకోర్టులో న్యాయపరమైన పరిణామాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) , మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు పూర్తయ్యాక హైకోర్టు తన తీర్పును…
KTR : తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, కేటీఆర్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది , జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం రేపు (బుధవారం) విచారణ జరపనుంది. ఈ కేసు సుప్రీంకోర్టు కోర్ట్…
Satyavathi Rathod: ఫార్ముల ఈ రేస్ కారు వ్యవహారంపై బీఆర్‌ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమకేసు అని, 1992లో ఈ కార్ రెస్ నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నించినా.. ఇంతవరకూ ఎవరూ ఈ రేస్ ను తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో…
హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను నటుడు మోహన్‌బాబు పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు మోహన్‌బాబు క్షమాపణ చెప్పారు. తన వల్లే తప్పిదం జరిగిందని రంజిత్ తల్లి భార్య, పిల్లలను మోహన్ బాబు క్షమాపణలు కోరారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసునని.. నువ్వు తొందరగా రికవరీ కావాలి...ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదని రంజిత్‌తో మోహన్ బాబు అన్నారు.
తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది.