Posters : ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించి స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలుసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ, వారికి మార్గదర్శనం చేసేలా ఉన్నాయి.
ఈ పోస్టర్లలో మావోయిస్టు సిద్ధాంతాన్ని సూటిగా ప్రశ్నిస్తూ – “సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా, అక్కల్లారా… మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఎప్పుడైనా ఆశాకిరణంగా మారిందా?” అని ప్రశ్నించారు. అంతేగాక, నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఆ ఉద్యమ మార్గం ప్రజల్లో ఆదరణ కోల్పోయి బీడుబూమిలా మారిపోయిందని వాఖ్యానించారు.
మావోయిస్టు అగ్రనాయకులకు ప్రత్యేకంగా సందేశం ఇచ్చిన పోస్టర్లలో.. “ఇకనైనా కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి, మారిన కాలానికి అనుగుణంగా ప్రజల జీవన విధానంలో భాగస్వాములు కండి” అంటూ విజ్ఞప్తి చేశారు. ఆయుధాల మార్గాన్ని విసర్జించి ప్రజాస్వామ్య మార్గాన్ని అవలంబించాలన్న పిలుపు ఇందులో ప్రధానంగా ఉంది.
AP Government: ఆ అధికారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 10 నుంచి 14 శాతానికి పెంపు..!
“ఆయుధాలు మనకొద్దు.. ప్రజామోద మార్గమే ముద్దు” అంటూ స్పష్టమైన సందేశాన్ని ఈ పోస్టర్లు ఇచ్చాయి. మేధస్సును ప్రజల అభివృద్ధికి వినియోగించుకోవాలని, గెరిళ్ల జీవితాన్ని వీడి మౌలిక సమాజంలో విలీనం కావాలని సూచించాయి.
ఈ పోస్టర్లు ఎవరివల్ల వెలిసాయి? నిజంగానే ‘ప్రజా ఫ్రంట్’ అనే వేదిక ఉందా? లేదా ఇది ప్రభుత్వ అనుబంధ సంస్థల కృషా ఫలితమా? అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు. అయితే ములుగు జిల్లాలో మావోయిస్టు గతి, గ్రామీణ ప్రజల ఆత్మస్థితి పట్ల కొనసాగుతున్న చర్చల మధ్య ఈ పోస్టర్లు కొత్త కోణాన్ని తెరపైకి తీసుకువచ్చాయి.
Bengaluru: ఒడిశా తరహాలో బెంగళూరులో మరో ఘోరం.. విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారం