ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? ఈ రోజు తేలిపోనుందా? అనే చర్చ సాగుతోంది.. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అందులో భాగంగా టీఎంసీ సుప్రీం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇవాళ విపక్షాలతో సమావేశం కానున్నారు.. అయితే, ఈ భేటీకి దూరంగా ఉంటున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్…
తెలంగాణ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలు డిఫరెంట్. ఎప్పుడు ఏ జెండా కిందకు వెళ్తాయో.. ఎలాంటి అజెండాను ఎత్తుకుంటాయో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం కొత్త దోస్తీకి కసరత్తు చేస్తున్నట్టు టాక్. ఇంతకీ ఏంటా పార్టీలు? టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేయడానికి ఉన్న అభ్యంతరాలేంటి?తెలంగాణలో రాజకీయం కాక మీద ఉంది. రెండు, మూడు నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలనొప్పే అని డిసైడ్ అయినట్టు ఉంది టీఆర్ఎస్. కొత్తగా…
రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు చెప్పిందే రామకృష్ణ చేస్తున్నారనే విమర్శలపై ఆయన స్పందించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలపై రామకృష్ణ తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల పాత్ర తగ్గుతోంది. పార్లమెంటులో 5 సీట్లే వున్నాయి. ప్రజలకు ఇప్పుడున్న సమస్యలు వేరు. సమస్యల పరిష్కారం కోసం కొత్త పద్ధతులు కావాలి. ప్రజలకోసం పోరాటం చేయాలి. వర్గ పార్టీ కాబట్టి కష్టజీవులు, కార్మికులు, కర్షకుల కోసం మేం పోరాడుతున్నాం. మార్పులు…
ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో ఆయన కీలక అంశాలు వెల్లడించారు. బీజేపీ ఇప్పుడు ఎదుగుతూ వుంది. దానికి మేం కారణం కాదు. కాంగ్రెస్ బలహీనంగా వుంది. మతాన్ని ఉపయోగించుకుని ముందుకెళుతోంది. కాంగ్రెస్ వైఫల్యాల వల్ల బీజేపీ యూపీలో ఎదిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బీజేపీలో కలిసిపోయారు. మేం కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అని భావించలేదు. కమ్యూనిస్టుల శక్తి ఏంటో మాకు తెలుసు. కాంగ్రెస్ మీద అసహనంతో బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ ని అవసరమయిన సమయాల్లో విమర్శించాలి.…
ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్రారంభమైన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలు. ఈ సభలు ఇవాళ్టినుంచి ఈనెల 10 వరకు జరగనున్నాయి. కాగా ఈ కార్యక్రమాలకు సీపీఐజనరల్ సెక్రటరీ డి. రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఏ ఐవైఎఫ్ నాకు తల్లి లాంటిదన్నారు. కమ్యూనిస్టు పార్టీ భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడిందన్నారు. కాంగ్రెస్‌తో పాటు ముందుండి పోరాడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. బీజేపీ,…
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. హుజూరాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దేశ భవిషత్తును పాడుచేసే విధంగా మోడీ పాలన సాగుతోందని, ప్రభుత్వ రంగాలను తక్కువకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని చాడ మండిపడ్డారు. రైతులను బజారు పాలు చేసే చట్టాలు తెచ్చారు, మోడీ పాలనలో రైతుల బతుకులు దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని…
లెఫ్ట్ పార్టీల ప్రభావం ఉన్న హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎత్తుగడ ఏంటి? వామపక్షాల మద్దతు కూడగడుతుందా? గత ఉపఎన్నికల చరిత్ర ఏం చెబుతోంది? అవే వ్యూహాలు హుజురాబాద్‌లో రిపీట్ అవుతాయా? లెఫ్ట్ పార్టీల మద్దతు టీఆర్‌ఎస్ సంపాదిస్తుందా? హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు,…