శనివారం బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. తాను ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరిగిన చేయితో వచ్చానని వెల్లడించాడు. Xలో పోస్ట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఫ్రాక్చర్ అయినప్పటికీ పోటీలో పాల్గొన్నానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సమయంలో గాయమైందని చెప్పాడు.