Lebanon: వాకీటాకీల పేలుడు ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య.. మరింత పెరిగే ఛాన్స్
- వాకీటాకీల పేలుడు ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
- మరింత పెరిగే ఛాన్స్.. పేలుళ్లతో వణికిపోతున్న లెబనాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెబనాన్‌లో తాజాగా వాకీటాకీలు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. 300 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆయా ప్రాంతాలు రక్తంతో తడిచిపోయాయి. మరో వైపు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం పేజర్ల పేలుళ్ల ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం కూడా మరోసారి పేలుళ్లు జరగడం లెబనాన్‌ను వణికి పోయింది. తాజాగా వాకీటాకీలు పేలడంతో వందలాది మంది గాయపడ్డారు. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతిచెందిన వారికి బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రాజధాని బీరూట్‌లో ఈ పేలుళ్లు సంభవించాయి.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్.. ఇసుక విషయంలో జోక్యం వద్దు..
Also Read
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని హిజ్బుల్లా ప్రకటించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కమ్యూనికేషన్ వ్యవస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇటీవలే లెబనాన్.. అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులోనే ఇజ్రాయెల్ పేలుడు పదార్ధాలు అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానిస్తోంది. తాజా ఘటనలు లెబనాన్ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Viral Post: భారతీయ వంటకాలపై నోరుపారేసుకున్న ఆస్ట్రేలియన్ యూట్యూబర్.. నెటిజన్లు ఫైర్
మంగళవారం పేజర్ల పేలుడు ఘటనలో 12 మంది చనిపోగా.. 2,800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్ రాయబారితో పాటు హిజ్బుల్లా కీలక నేతలున్నారు. ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Lebanon: లెబనాన్‌లో మళ్లీ ప్రకంపనలు.. ఒక్కసారిగా పేలిన వాకీటాకీలు, మొబైల్స్
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..