Lawrence Bishnoi: ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో గోదారా, బిష్ణోయ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.
Saleem Pistol arrest: ఆయుధ స్మగ్లర్, ఐఎస్ఐతో, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో లోతైన సంబంధాలు కలిగి ఉన్న సలీం పిస్టల్‌ను ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. ఆగస్టు 9న నేపాల్‌లో సలీంను అరెస్టు చేశారు. చాలా ఏళ్లుగా అతను పాకిస్థాన్ నుంచి ఆధునిక ఆయుధాలను అక్రమంగా ఇండియాకు రవాణా చేస్తున్నాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భద్రతా సంస్థల సహకారంతో షేక్ సలీం అలియాస్ సలీం పిస్టల్‌ను అరెస్ట్ చేసి, ఢిల్లీ పోలీస్ స్పెషల్…
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడి దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ కత్తిపోట్లకు గురయ్యాడు. మొత్తం 6 కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం వెంటనే సైఫ్‌ని ఆస్పత్రికి తరలిండచంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ ఇంటికి ఉన్న ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా దుండగుడు ఇంటిలోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
తనపై కుట్ర జరుగుతోందని పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అన్నారు. ఇందులో పోలీసులు కూడా భాగస్వాములయ్యారని ఆరోపించారు. తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను ఇరికిస్తున్నారన్నారు. నేను జైలులో ఉన్నాను. ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని ఎలా బెదిరిస్తాను? అని పేర్కొన్నారు. జైలు నుంచి హత్య ఎలా చేస్తాం? అని తెలిపారు. శనివారం జోధ్‌పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లారెన్స్ బిష్ణోయ్ తన వివరణ ఇచ్చారు.
దాదాపు రెండు నెలల క్రితం బాబా సిద్ధిక్‌ను షూటర్లు కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిక్‌ను చంపడానికి ముందు సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. బాబా సిద్ధిక్ హత్యకేసుకు సంబంధించి విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
Pappu Yadav: బీహార్ పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌కి ఇటీవల గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆరోపించాడు. తనకు సెక్యూరిటీ పెంచాలని బీహార్ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కోరాడు.
Anmol Bishnoi: ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఆశ్రయం కోరుతున్నట్లు సమచారం. భారత్‌లో జరిగిన పలు హై ప్రొఫైల్ హత్యల్లో్ అన్మోల్ బిష్ణోయ్ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. బిష్ణోయ్ గల వారంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులతో అరెస్ట్ చేయబడ్డాడు. నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలోకి ప్రవేశించినందుకు బిష్ణోయ్‌ను కాలిఫోర్నియాలో యుఎస్ ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) అరెస్టు చేసినట్లు వర్గాలు తెలిపాయి. అతను ప్రస్తుతం అయోవాలోని పొట్టవట్టమీ కౌంటీ జైలులో…
Lawrence Bishnoi: గత నెలలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సిద్ధిక్ తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కాల్చి చంపారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన శుభమ్ లోంకర్ ఖచ్చితంగా బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేస్తునట్లు పోలీసుల విచారణలో తేలింది.
Baba Siddique Murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ హత్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ హత్యలో ప్రధాన షూటర్ శివకుమార్‌ని ఆదివారం అరెస్ట్ చేశారు.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు.