Salman Khan: సిద్ధిక్ హత్యకు ముందే సల్మాన్‌ను చంపాలని స్కెచ్!
- బాబా సిద్ధిక్ హత్యకు ముందే సల్మాన్‌ను చంపేందుకు ప్లాన్ చేశారట
- విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: దాదాపు రెండు నెలల క్రితం బాబా సిద్ధిక్‌ను షూటర్లు కాల్చి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిక్‌ను చంపడానికి ముందు సల్మాన్ ఖాన్‌ను హత్య చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. బాబా సిద్ధిక్ హత్యకేసుకు సంబంధించి విచారణలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. బాబా సిద్ధిక్‌ను 2024 అక్టోబర్ 12న ముగ్గురు దుండగులు ముంబైలో కాల్చిచంపారు. వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు 66 ఏళ్లు. బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారుడు జీషాన్ కార్యాలయం సమీపంలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సిద్ధిక్‌పై దుండగులు కాల్పులు జరిపారు. విచారణ సందర్భంగా, నిందితులు సల్మాన్ ఖాన్ షూటర్ల హిట్ లిస్ట్‌లో ఉన్నారని, అయితే నటుడి గట్టి భద్రతా ఏర్పాట్ల కారణంగా వారు అతనిని చేరుకోలేకపోయారని పలు వర్గాలు తెలిపాయి.
Read Also: Syria: ఉక్రెయిన్ తర్వాత సిరియాలో భీకరపోరు సాగిస్తున్న రష్యా సైన్యం
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అర్థరాత్రి కాల్పులు జరిపారు. ముష్కరులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను గుజరాత్‌లో అరెస్టు చేశారు. తరువాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ ఘటనకు బాధ్యత వహించింది.గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ పదేపదే బెదిరింపులకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌తో విభేదాలే కాకుండా గ్యాంగ్‌స్టర్ పేరుతో సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు గురిచేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకునే వ్యక్తి గత నెలలో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్‌ఖాన్‌ను ఆలయాన్ని సందర్శించి కృష్ణజింకను చంపినందుకు క్షమాపణ చెప్పాలని లేదా రూ. 5 కోట్లు చెల్లించాలని కోరారు. అక్టోబర్‌లో జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల విక్రయదారుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించి, రూ. 5 కోట్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు అరెస్టయ్యాడు. కొద్ది రోజుల తర్వాత, నటుడికి గుర్తు తెలియని వ్యక్తి నుండి తాజాగా హత్య బెదిరింపు వచ్చింది. ఆ వ్యక్తి రూ. 2 కోట్లు డిమాండ్ చేశాడు.సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు కాల్‌కు సంబంధించి నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడిని కూడా ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పెరుగుతున్న ఈ బెదిరింపులకు ప్రతిస్పందనగా, సల్మాన్ ఖాన్‌కు Y+ భద్రత కల్పించబడింది. సల్మాన్ నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముంబై పోలీసులు భద్రతను మెరుగుపరచడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన ఏఐ- పవర్డ్, హై-రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!