Disha Patani: బాలీవుడ్ నటి దిశాపటానీ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్) మంగళవారం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బరేలిలోని దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దర్ని అధికారులు కాల్చి చంపారు. నిందితులను రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర అలియాస్ కల్లు, హర్యానాలోని సోనిపట్ నివాసి అరుణ్‌లుగా గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్…
MP Arvind: జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని.. వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.. సిమీ పీఎఫ్ ఐ కార్యకలాపాలకు అడ్డగా మారింది.. హిందూ అమ్మాయిలను…
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో రైలు టిక్కెట్లు కొనడంపై జరిగిన వాగ్వాదంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్‌పై కన్వారియాలు(శివభక్తులు) దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 200 మందికి పైగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పెద్ద పెద్ద మారణాయుధాలతో దాడి చేశారు అని ఆరోపించారు. ఆయన్నీ హతమార్చేందుకు ప్రయత్నం చేశారు.. ఇంట్లో ఉన్న ప్రసన్న తల్లి షాక్ కు గురై ఏదైనా అయ్యుంటే ఎవరిది బాధ్యత అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి, అనుచరుల పైనా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Rajasthan: రాజస్థాన్ బిల్వారా జిల్లాలోని జహాజ్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం చిన్న రోడ్డు ప్రమాదం, 25 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపడానికి కారణమైంది. టోంక్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, జహాజ్‌పూర్ ప్రాంతంలోని ఒక మసీదు వద్ద తోపుడు బండిని కారు ఢీ కొట్టింది. స
Tamilnadu: 27 ఏళ్ల ఆలయ గార్డు కస్టడీలో మరణించిన ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, కస్టడీలో ఒక వ్యక్తి చనిపోవడంపై మద్రాస్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జూన్ 27న ఒక ఆలయం నుంచి ఆభరణాలను దొంగలించాడనే కేసులో అరెస్ట్ కాబడిన అజిత్ కుమార్‌పై ‘‘ అధికార మత్తులో ఉన్న పోలీసులు’’ దారుణంగా దాడి…
పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఆ ఎస్సై దారి తప్పాడు. తన వద్దకు వచ్చే వారికి మంచి చెడు చెప్పాల్సిన వృత్తిలో ఉండి తన వంకర బుద్ధి బయట పెట్టుకున్నాడు. కట్టుకున్న భార్యపైనే నిత్యం వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె ఉసురు తీసుకుంది. ఖమ్మంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఫొటోలో ఉన్న ఇతని పేరు రాణా ప్రతాప్. ఖమ్మంలోని రైల్వే విభాగంలో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఇతనికి 8 ఏళ్ల క్రితం…
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని మధ్యాహ్నం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఎన్‌కౌంటర్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలోని చాలా మంది ప్రమాదకరమైన నేరస్థులు పోలీసు ఎన్‌కౌంటర్లలో మరణించారు. పెద్ద సంఖ్యలో నేరస్థులు గాయపడ్డారు.
తిరుపతి రూరల్ (మం) దామినీడులో నాగాలమ్మ ఆలయం కూల్చివేతపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ సూచన మేరకు ఆర్డీవో, డిఎస్పీ ఇరువురితో సమాలోచన జరిపారు. కూల్చి వేసిన ప్రాంగణాన్ని యధావిధిగా గ్రామస్థులకు వదిలేయాలని కృష్ణమూర్తి నాయుడుకి ఆదేశాలు జారీ చేశారు. నేలమట్టం చేసిన ప్రాంతంలోనే తిరిగి ఆలయాన్ని పునర్ నిర్మించాలని సూచించారు. నెలరోజుల్లో ఆలయ నిర్మాణాన్ని యధావిధిగా నిర్మిస్తానని కృష్ణమూర్తి నాయుడు అంగీకరించారు.