YS Jagan: ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మాజీ సీఎం, వైస్సార్సీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో చంద్రబాబు గారు.. అంటూ, అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారికి ఆపాదిస్తూ వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసులమీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారు. ఈ అరాచకానికి…
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ అంశంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాజాగా విధానసౌధ భద్రతా విభాగం డీసీపీ ఎం.ఎన్. కరిబసవనగౌడ రాసిన లేఖ బయటపడింది. అందులో కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు తేలిసంది. జూన్ 4న, డీసీపీ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను బెదిరించిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది. కొత్వాలి ప్రాంతం నుంచి శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు తన భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఉన్నప్పుడు ఫోన్ చేసి బెదిరించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్ నెలకొంది. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డిఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు.
గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.
Maoists : ములుగు జిల్లాలో నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. వారు జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఎదుట తమ ఆయుధాలను వదిలి, సాధారణ జీవితం వైపు అడుగులు వేసే నిర్ణయం తీసుకున్నారు. లొంగుబాటు అయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు…
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇది గతేడాది నుంచి ఆపరేషన్ ఊపందుకుంది.
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్న సీఎస్సార్‌కు ఉదయం బిపీ హెచ్చు తగ్గులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎకో తీయించడంతో గుండె సంబంధిత ఇబ్బంది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండె జబ్బులకు సంబంధించి స్పెషల్ వార్డులో పీఎస్సార్ ఆంజనేయులును ఉంచారు. ప్రస్తుతం వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.
ఛత్తీస్ఘఢ్లో ఎన్కౌంటర్ల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 10 రోజులు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని పోలీస్ శాఖ సూచనలు చేసింది. ఎమ్మెల్యేను నేరుగా కలిసేందుకు కూడా రావద్దని, ఫోన్ లో సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.