మహిళల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం గౌరవంతో వ్యవహరిస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి భార్యపై కిరణ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని మంత్రి పేర్కొన్నారు. కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్టు చేయించామని తెలిపారు. ఇలాంటి పైశాచికంగా ఆనందపడే పనులకు ప్రభుత్వంలో చోటు లేదని…
చేబ్రోల్ కిరణ్‌ను తీసుకెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుపడ్డ ఈ కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను ముసుగేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులతో గోరంట్ల మాధవ్ వాగ్వాదానికి దిగారు. "నేను దేశానికి ఎంపీగా పని చేశా.. నేను ఏమైనా దోపిడీ దొంగనా?" అంటు కేకలు వేశారు. గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మాధవ్‌ను తొలుత నల్లపాడు పీఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు అక్కడ…
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల పైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఉదయం సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్‌కు పోలీసులు వచ్చారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్‌లకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్ష మంది పోలీసులు ఉన్నా, మహిళలకు రక్షణ లేకుండా…
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బంధువులతో కలిసి వచ్చిన యువతిపై గుట్టల ప్రాంతంలోకి లాక్కెళ్లి 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో, ఆమెతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా…
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బాంరగడ్ తాలుక జూవి గ్రామానికి చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోలు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం మేరకు, ఓ వివాహ వేడుకకు వెళ్లిన పూసు పుంగంటిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేశారు. అతను పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ…
Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థకు వ్యతిరేకమని, కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో ప్రస్తావించకూడదని స్పష్టంగా “కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్” పేర్కొంటుందన్నారు. ప్రస్తుతం…
భారతదేశంలో రైళ్ల మీద దాడులు చెయ్యడం సర్వసాధారణం అయ్యింది. ముఖ్యంగా వందేభారత్ రైళ్లు ప్రారంభం అయిన తరువాత రైళ్ల మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వడం చాలా ఎక్కువ అయ్యింది. వందేభారత్ రైళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన తరువాత మామూలు రైళ్ల మీద దాడులు ఎక్కువ అయ్యాయి. రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్‌లను ధ్వంసం చేయడం వంటి కేసులు పెరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు…
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం సంభాల్, ఔరంగజేబు సమస్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అధికార బీజేపీ పార్టీ మతపరమైన ప్రదేశాలను ప్రమాదంలో పడేస్తోందని, మతపరమైన ఉద్రిక్తతను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సంభాల్, ఔరంగజేబు వంటి అంశాలను లేవనెత్తుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ, రంజాన్ మాసములోని రెండవ శుక్రవారం ఒకే రోజు వచ్చాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెండు పండుగలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ , సిటీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ప్రతి జోన్ లోని సున్నితమైన, ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ సహా మరో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని ఏ7, ఏ8 తరఫు న్యాయవాది చిరంజీవి మెమో దాఖలు చేశారు.