హెచ్‌ఐవీలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకో పైలట్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని నితీశేశ్వర్ కాలేజీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లాలన్ కుమార్ తన 33 నెలల జీతాన్ని తిరిగి జీతాల విభాగానికి అందజేశారు. సుమారు దాదాపు రూ. 23 లక్షలు తిరిగి ఇచ్చారు.
యాప్ ద్వారా క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా.. సొంతంగా మ్యాపింగ్ సర్వీస్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఇది గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించేది. ఇటీవల ఓలా మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ ప్లాట్‌ఫారమ్ నుంచి నిష్క్రమించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు అమరని..ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు.
దేవుడు మాత్రమే నన్ను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పించగలడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ డిబేట్ కు సంబంధించి.. ఆ రోజు తాను అలసిపోయానని, అస్వస్థతకు గురయ్యానని చెప్పారు.
తాజాగా అన్ని ప్రైవేటు టెలికాం సంస్థలు రిఛార్జ్ ప్లాన్ ఛార్జీలను పెంచాయి. జులై మూడు నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్యతరగతి జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చినిగామ్‌లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు.