టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు.…
ఏపీలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రేపు(నవంబర్ 29) అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read Also: కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు…
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మరపురాని అనుభూతి. పెళ్లి లాంటి క్షణాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి. అందుకే కొందరు ఆ క్షణాలను గుర్తుండిపోయేలా మలుచుకుంటారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి కూడా తన పెళ్లిని గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలని భావించాడు. దీంతో పాటు సామాజికంగానూ మంచి ఆలోచన చేశాడు. వివరాల్లోకి వెళ్తే… హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ సంఘం వ్యవస్థాపక సభ్యుడు దినేష్‌కు ఇటీవల పెళ్లి కుదిరింది. దీంతో పెద్దలు ఘనంగా పెళ్లి చేయాలని…
అమెజాన్ ఇండియా సీఈవో అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య ఒప్పందంలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఉల్లంఘించారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అమెజాన్ సీఈవో అమిత్ అగర్వాల్ వచ్చే వారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. Read Also: ‘బిగ్‌బాస్’ నుంచి రవి ఎలిమినేట్.. అసలు ఏం జరిగింది? 2019లో అమెజాన్ కంపెనీ రూ.1400 కోట్ల ఒప్పందంతో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌లో…
తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే 12వ వారం అనూహ్యంగా యాంకర్ రవి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అతడు బయటకు రావడంతో అతడి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో రవి టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. దానికి తగ్గట్లే రవి స్ట్రాటజీలు ఉండేవి. టాస్కుల్లో బెస్ట్ ఇవ్వడానికి రవి ప్రయత్నించేవాడు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో సిరి లేదా కాజల్ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్…
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 234/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న దశలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32), పుజారా (22), అక్షర్ పటేల్ (28 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, జేమీసన్ చెరో మూడు వికెట్లు…
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా గెలిచినందుకు సదరు లేఖలో కవితకు రామోజీరావు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు శాసనమండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి నాయకురాలిగా ఇనుమడించిన కీర్తిని గడిస్తారని విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలు అందుకుంటారని భావిస్తున్నా’…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు ఏపీలో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…
కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అరంగేట్ర టెస్టులోనే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా శ్రేయాస్ నిలిచాడు. కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతున్న అతడు తొలి ఇన్నింగ్సులో సెంచరీ సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశారు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అతడు 170 పరుగులు చేశాడు. Read Also: కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్.. ఐసీసీ టోర్నీ రద్దు అరంగేట్ర…
నందమూరి, అల్లు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని శనివారం రాత్రి జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారితో తనకు చనువు ఉందని… తన తండ్రి ఎన్టీఆర్ గారికి అల్లు రామలింగయ్య గారు ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. అఖండ మూవీ విషయానికి వస్తే .. నవ పూజ విధానాల సమాహారమే ఈ సినిమా అని పేర్కొన్నారు.…