తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే 12వ వారం అనూహ్యంగా యాంకర్ రవి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అతడు బయటకు రావడంతో అతడి అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో రవి టాప్-5లో ఉంటాడని అందరూ భావించారు. దానికి తగ్గట్లే రవి స్ట్రాటజీలు ఉండేవి. టాస్కుల్లో బెస్ట్ ఇవ్వడానికి రవి ప్రయత్నించేవాడు. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో సిరి లేదా కాజల్ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ అభిమానులు లెక్కలు వేసుకున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి.
Read Also: ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది… మెగా అభిమానులకు గూస్ బంప్స్ షురూ
ఈ వారం నామినేషన్‌లలో ఉన్న వారిలో ఓటింగ్ విషయంలో మూడు రోజుల కిందటి వరకు ప్రియాంక చివరి స్థానంలో ఉండటంతో ఆమె ఎలిమినేట్ కావడం ఖాయం అనుకున్నారు. అయితే షణ్ముఖ్ అభిమానులు అనూహ్యంగా రవిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వారంతా గంపగుత్తగా ప్రియాంకకు ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రియాంకకు ఓటింగ్ శాతం పెరిగి కింది నుంచి మూడో స్థానానికి చేరింది. మరోవైపు రవి ఎలాగైనా టాప్-5 చేరతాడనే నమ్మకంతో ఉన్న అతడి అభిమానులు ఓటింగ్‌ను సీరియస్‌గా తీసుకోలేదని టాక్ నడుస్తోంది. తాజా పరిణామాలతో కాజల్, రవి చివరి రెండు స్థానాల్లో నిలిచారని.. కాజల్‌కు అతడి స్నేహితుడు సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో కాజల్ సేవ్ అయిందని.. రవి ఎలిమినేట్ అయ్యాడని సమాచారం.