టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Read Also: ఐపీఎల్: అహ్మదాబాద్ కెప్టెన్‌గా…
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ అరుదైన ఘనత సాధించింది. 2021 మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలేలో మూడు టైటిళ్లు గెలుచుకున్న ఏకైక మహిళగా శ్రీకాకుళం జిల్లా వాసి పైడి రజనీ రికార్డులకెక్కింది. గ్రాండ్ ఫినాలేలో జరిగిన క్లాసిక్ కేటగిరిలో మిసెస్ డైనమిక్ టైటిల్, కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్, క్రౌన్ ఆంధ్రప్రదేశ్ టైటిళ్లను పైడి రజనీ గెలుచుకుంది. ఈ పోటీల్లో మొత్తం 100 మంది మహిళలు పాల్గొనగా… 38 మంది ఫైనల్స్‌కు అర్హత సాధించారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్.. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. గతంలో శశాంక్ గోయల్ కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలు అందించారు. అంతేకాకుండా…
హైదరాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే రోడ్డులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. పంజాగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించడంతో… శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. Read Also: జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి… ధర్నాకు దిగిన కుటుంబీకులు ఈ బ్రిడ్జి నిర్మాణం…
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13…
షాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి పండగకు ఊరెళ్లి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వచ్చేందుకు రైల్వేకోడూరులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. కాచిగూడ వరకు టిక్కెట్ కొనుగోలు చేసింది. అయితే మంగళవారం ఉదయం 5:30 గంటలకు రైలు షాద్‌నగర్‌లో ఆగిన సమయంలో ఆమె రైలు దిగింది. అది కాచిగూడ కాదని తెలుసుకుని రైలు ఎక్కే క్రమంలో.. అప్పటికే రైలు కదలడంతో జారి రైలు కింద పడిపోయింది.…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. ఈసారి గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో పాలుపంచుకోనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే…
కొందరు వ్యక్తులకు సరికొత్త ఆవిష్కరణలు చేయడమంటే చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరూ చేయని ఆవిష్కరణలు చేసి వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి కూడా ఇలాగే ఆలోచించి ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌ను రూపొందించాడు. అయితే ఈ సైకిల్‌ను అతడు తయారుచేసిన పద్ధతి తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే అతడు వాడి పారేసిన వస్తువులతో ఈ సైకిల్ తయారుచేయడం విశేషం. ఆడమ్ జ్డానోవిచ్ అనే వ్యక్తి రీసైక్లింగ్ వస్తువులతో అతి పొడవైన…
ఖమ్మం బ్రాహ్మణ బజార్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఓ ఖాళీ స్థలంలో ఆరుగురు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటున్న సమయంలో భారీ చెట్టు కూలి పక్కనే ఉన్న గోడ మీద పడింది. దీంతో గోడ కూడా కూలింది. దీంతో గోడ పక్కనే ఆడుకుంటున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. Read Also: మీకు కరోనా సోకిందా.. అయితే ఈ మందులు…
కరోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: గుడ్…