డయాబెటిస్ కట్టడికి మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా సెమాగ్లూటైడ్ ఔషధాన్ని నోవోనార్డిస్క్ సంస్థ మాత్ర రూపంలో భారత్‌లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లుగా ఇంజెక్షన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఔషధం ఇకపై నోటి మాత్ర రూపంలో లభ్యం కానుంది. ప్రపంచంలోనే ఇది తొలి, ఏకైక ఓరల్ సెమాగ్లూటైడ్ కావడం గమనార్హం. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో బ్లడ్‌షుగర్‌ను అదుపులో ఉంచడం, బరువు తగ్గించడంలోనూ ఈ ఔషధం ఉపయోగపడుతుందని నోవోనార్డిస్క్ సంస్థ పేర్కొంది. Read Also: కరోనా ఎఫెక్ట్…
★ అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం… 32 అంశాలతో కూడిన అజెండాపై కీలకంగా చర్చించనున్న కేబినెట్★ నేడు విశాఖ రానున్న కేంద్ర చమురు శాఖ సహాయమంత్రి రామేశ్వర్… ఐఐపీఈ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రామేశ్వర్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు★ నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం… ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్న ఉద్యోగ సంఘాలు.. పీఆర్సీపై ఐక్యంగా పోరాటం చేయాలని ఉద్యోగ సంఘాల నిర్ణయంనేడు…
నీట్ ప్రవేశాల్లో ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్‌లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య కోసం జాతీయస్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశపరీక్ష అడ్మిషన్లలో ఓబీసీ కోటా రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. సామాజిక, ఆర్థిక నేపథ్యానికి సంబంధించి మెరిట్…
ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ గొడవ కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టారు. పలు చోట్ల పోలీసులు ఉద్యోగులను అడ్డుకున్నారు. మరోవైపు పీఆర్సీ జీవోల విషయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పాట పాడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముద్దుల…
డ్రగ్స్ వాడేవాళ్లకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం డ్రగ్స్ వాడకం అనేది ఇంటింటి సమస్యగా మారిందని.. ఇకపై డ్రగ్స్ వాడేవాళ్లను కఠినంగా శిక్షిస్తామని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వాడుతూ సినిమా వాళ్లు పట్టుబడినా మినహాయింపు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇకపై సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ తీసుకునే వారిని అరెస్ట్ చేయకపోతే దీన్ని కట్టడి చేయలేమని సీపీ అభిప్రాయపడ్డారు. Read Also: తెలంగాణలో మరో భారీ…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ఉద్యోగులు అడగ్గపోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోతే ప్రభుత్వం రూ.18వేల కోట్ల భారం పడి ఉండేది కాదన్నారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్‌లో ఉన్న చిన్న కాంట్రాక్టు బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించి ఉండేదన్నారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నామని… ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.…
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్‌ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా మారిందన్నారు. గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలపై…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు సవరించిన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ కార్యాలయాలను ఆదేశించింది. దీంతో వచ్చే నెల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు అందనున్నాయి. ఓ వైపు ఉద్యోగులు కొత్త పీఆర్సీని వెంటనే రద్దు చేయాలని ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల నిరసనలు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఎలా…
గత ఏడాది నవంబరులో అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం పూర్తిస్థాయిలో మెరుగుపడింది. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణ… ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో తన కుటుంబానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. Read Also: నేటితో ‘అఖండ’ 50 రోజులు.. 103 సెంటర్లలో మాస్ జాతర బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా కాల్ చేసి ప్రభుత్వం…
సాధారణంగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. కానీ టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు రక్షణ లభించే అవకాశమే లేదని ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల్లోనే 30 శాతం మందిలో యాంటీబాడీలు తగ్గిపోతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. Read Also: భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు… ఒక్కరోజులో.. ముఖ్యంగా 40 ఏళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు…