ముస్లింల చేత వందేమాతం పాడిస్తాం: సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్‌ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల ఎనిమీ ప్రభుత్వంగా మారిందన్నారు. గతంలో ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు.
Read Also: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. జీతాలపై ఏపీ సర్కారు కీలక ఆదేశాలు
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
మరోవైపు ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని సోము వీర్రాజు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల విషయంలో ఒక్కొక్కరిపై ఒక్కో రకంగా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ముస్లింలకు స్టేషన్ బెయిల్ ఇస్తే.. హిందువు అయిన బీజేపీ కార్యకర్తను మాత్రం రిమాండ్‌కు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని చెప్పొచ్చని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. హిందూ వ్యతిరేక విధానాలతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శలు చేశారు. ఆత్మకూరు ఘటనలో బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఎస్‌డీపీఐ నేత అతావుల్లాను అరెస్ట్ చేయాలన్నారు. విజయనగరం, రామతీర్థం ఘటనల్లో ఇంత వరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేస్తే వెంటనే అరెస్టు చేశారని.. రాముని విగ్రహం ధ్వంసం చేస్తే నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముస్లింల చేత వందేమాతరం పాడించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!