ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబదేవి కూడా కొలువైన శ్రీశైలం మహాక్షేత్రం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో ఎస్.లవన్న వెల్లడించారు. ఉత్సవాల సమయంలో ముందస్తుగా గదుల రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఈవో తెలిపారు. అయితే కుటీర నిర్మాణ పథకం కింద వసతి గదులు నిర్మించిన దాతలకు మాత్రం గతంలో మాదిరిగా ముందస్తు రిజర్వేషన్ ఉంటుందన్నారు.శ్రీశైలంలో జరిగే…
✪ పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నేడు ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు… పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం✪ తెలంగాణలో నేడు రెండో రోజు ఇంటింటి ఫీవర్ సర్వే… సర్వేలో పెద్దల, చిన్నారుల ఆరోగ్య వివరాల సేకరణ.. మరో ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఫీవర్ సర్వే✪ నేడు రెండో రోజు తెలంగాణ సీపీఎం రాష్ట్ర మహాసభలు.. ఈనెల 25 వరకు కొనసాగనున్న సమావేశాలు✪ కేప్‌టౌన్: నేడు…
దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగే వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్‌కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను…
దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం పొలిటికల్ ర్యాలీలు, రోడ్ షోలపై గతంలో నిషేధం విధించింది. తాజా ఆ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే తొలిదశలో ఎన్నికలు జరుపుకునే ప్రాంతాల్లో ఈ నెల 28 తర్వాత బహిరంగ సభలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రెండో దశ…
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టుకు షాకుల మీద షాకులు తగిలాయి. టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా… ఆదివారం జరిగే నామమాత్రపు మూడో వన్డేలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి రెండు వన్డేల్లో విఫలమైన ఆటగాళ్ల స్థానంలో వేరేవాళ్లకు చోటు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రెండు వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా భారత జట్టు ఓటమిలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వర్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో…
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వేశాఖ కలవరపడుతోంది. ఈ మేరకు కరోనా కేసులు పెరగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే…
పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే భారత్ మరోసారి బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ కేటగిరిలో వెంకటేష్ అయ్యర్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చినా రెండో వన్డేలో కూడా అతడికే తుది జట్టులో స్థానం కల్పించింది. తొలి వన్డేలో ఓడిన భారత్ రెండో వన్డేలో కూడా ఓడితే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయాల్సి ఉంది. జట్ల వివరాలుభారత్:…
ఢిల్లీ నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఓ నేత ప్రేమ కోసం రఘురామకృష్ణంరాజు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ఎవరి మొప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా.. 40 ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్లకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతడి ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మాస్కులు ధరించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగిన చిన్నారులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు పిల్లలు మాత్రమే మాస్క్ ధరించేలా చూడాలని సూచించింది. ప్రతి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య కొన్ని నెలల కిందట విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో గతేడాది ప్రకటించి సమంత, నాగచైతన్య ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు. తమ దారులు వేరని, ఇకమీదట తాము దంపతులుగా జీవించబోమని వెల్లడిస్తూ అభిమానులకు షాకిచ్చారు. ఈ విషయం సినీ అభిమానులందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడిప్పుడే నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకుల విషయాన్ని మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టారని అందరూ…