వివిధ కారణాల వల్ల నాలుగేళ్లుగా నిర్వహించలేకపోయిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను తిరిగి ఈ ఏడాది ప్రారంభించాలని ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్‌ను నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహిస్తుండటంతో ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఆసియా కప్‌లో టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ జట్లతో పాటు మరో టీమ్ కూడా పాల్గొననుంది.…
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, భోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు అమలు కోసం ఆస్పత్రుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసింది. డ్యూటీకి వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే సెలవుల్లో కోత ఉంటుందని ఏపీ ప్రభుత్వం…
శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలకు ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకుండా తన ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తానని…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ అప్పుడే ప్రారంభం కాగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆర్.ఆర్.ఆర్ మూవీ క్రేజ్‌ను వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వినూత్నంగా ఆలోచించింది. సింగిల్ గ్యాస్ సిలిండర్ కలిగిన వినియోగదారులు…
మహిళల ప్రపంచకప్‌లో టీమిండియా అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. శనివారం నాడు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత మహిళలు ఓటమి పాలయ్యారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తికా భాటియా (59), హర్మన్ ప్రీత్‌కౌర్ (57…
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుక్రవారం నాడు తన గర్ల్‌ఫ్రెండ్, భారతీయ యువతి వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్‌తో ప్రేమలో ఉన్న అతడు.. 2020 ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా మ్యాక్స్‌వెల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. కాగా మ్యాక్స్‌వెల్-వినీ రామన్ జంటకు ఆస్ట్రేలియా క్రికెటర్లు, బెంగళూరు రాయల్…
మార్చి 18 నుంచి 20 వరకు మొత్తం 36 ఎంఎంటీఎస్ సర్వీసులు నడపబడవని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు తెలియజేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తొమ్మిది సర్వీసులు రైలు నెం. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139 మరియు 47140, రద్దు చేసినట్లు వెల్లడించింది. అంతేకాకుండా హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో తొమ్మిది సర్వీసులు – 447105,147109,47110, 47111, 47112, 47114, 47116, 47118 మరియు 47120 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సర్వీసుల రద్దులో లింగంపల్లి-ఫలక్‌నుమాలో…
మేఘాలయ హైకోర్టు గురువారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననాంగాన్ని లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకినా అత్యాచారంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. 2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 2018లో నిందితుడికి ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం నిందితుడు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ…
MLA Raja Singh Fired on IT Minister KTR. మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్లో పర్యటిస్తూ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ.. కేటీఆర్ ఇవాళ సభలో మాట్లాడుతూ బండి సంజయ్..దమ్ముంటే కరీంనగర్ మంత్రి గంగుల పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిండు.. అవినీతి, అక్రమాలతో బలిసి కొట్టుకుంటున్న గంగుల కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకు? బీజేపీలో సామాన్య కార్యకర్త చాలు అని…