MLA Raja Singh Fired on IT Minister KTR.
మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్‌లో పర్యటిస్తూ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ.. కేటీఆర్ ఇవాళ సభలో మాట్లాడుతూ బండి సంజయ్..దమ్ముంటే కరీంనగర్ మంత్రి గంగుల పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిండు.. అవినీతి, అక్రమాలతో బలిసి కొట్టుకుంటున్న గంగుల కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకు? బీజేపీలో సామాన్య కార్యకర్త చాలు అని ఆయన అన్నారు. ఈసారి చిత్తుచిత్తుగా ఓడించి తీరుతాం… అధికారం, అహంకారం, డబ్బు మదంతో కొట్టుకుంటున్న కేటీఆర్ బలుపును దించే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నయని గుర్తు పెట్టుకో అని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం బండి సంజయ్ కుమార్ కనీసం పార్లమెంట్ లో నోరు విప్పలేదని అడ్డగోలుగా కూతలు కూస్తున్నడు.
80 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును అంచనాలు పెంచి లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నవ్ అంటూ ధ్వజమెత్తారు. ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) సమర్పించాలని, ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్సు తీసుకుంటే కేంద్రం నిధులు మంజూరు చేయించే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. కేటీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్, ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ పత్రాలు సమర్పించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.