Meenakshi Natarajan Sarvodaya Sankalp Padayatra at Medak District. భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ..…
భూదాన్ ఉద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ, పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సర్వోదయ సంకల్ప పాదయాత్రలో మీనాక్షి నటరాజన్‌తో కలిసి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు…
అసని తుఫాన్ ముంచుకొస్తున్న. ఈ ఏడాది మొదటి తుఫాన్ ఇది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ప్రజలపై విరుచకుపడేందుకు సిద్ధమైంది. ఆ తరువాత అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని అనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేటి నుంచి మూడు…
All Political Parties Preparing for Elections. తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వ్యూహ రచన చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు మైకుల ముందు మేమంటే మేము అంటూ.. మైకుల పగిలేలా స్పీచులు ఇచ్చిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ప్రత్యర్థులకు ఆలోచనలకు అందకుండా వ్యూహాలు రచించేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు ఇతర పార్టీలు ఉన్నా.. తారాస్థాయి పోరుమాత్రం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్యనే ఉండబోతోంది. ఇటీవల చేసిన కొన్ని…
ప్రస్తుతం క్రికెటర్ల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెటర్లు పెళ్లిళ్లు చేసుకుని ఈ మెగా లీగ్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ తన భారత ప్రేయసిని పెళ్లి చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ టిమ్ సౌథీ కూడా అతడి బాటలోనే నడిచాడు. 33 ఏళ్ల వయసులో తాను చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయాను సౌథీ పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు…
దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా గుజరాత్‌లోని కచ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలానికి వెళ్లినా బాలికను ఎత్తుకెళ్లి బలవంతంగా మద్యం తాగించి కొందరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. భుజ్ శివారులో జరిగిన ఈ ఘటన మార్చి 16న జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని సమీపంలోని స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను హుస్సేన్ కాకల్…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కారణంగా పలు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోవడంతో భారత్‌లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ ధరను లీటరుకు రూ.25 పెంచారు. ఈ మేరకు దేశంలోని ప్రధాన చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర…
కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ భేటీలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పేందుకు వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఏపీకి ఇస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ…
టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఇందులో భాగంగా జర్నలిస్ట్ స్వప్నతో కలిసి ఆయన మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తాము మొక్కలు నాటినట్లు ఆర్జీవీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తనకు పచ్చదనం అంటే నచ్చదని, బురద అంటే అస్సలు గిట్టదని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు.…
ఐపీఎల్-15 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఎందుకంటే మొయిన్ అలీకి వీసా సమస్యలు వచ్చిపడ్డాయి. దీంతో అతడు ఇండియా రావడానికి ఇప్పటిదాకా వీసా లభించలేదని తెలుస్తోంది. మొయిన్ అలీ ప్రస్తుతం ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్…