111 జీవోను ఎత్తివేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి.. మాట్లాడుతూ.. గతంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు 111 జీవోను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 111 జీవో ఎత్తివేతపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు కేసీఆర్ తెలిపారు. పొల్యూషన్ బోర్డు, అటవీశాఖతో పాటు ఇతరులతో కలిసి ఎట్టిపరిస్థితుల్లో…
అసలే కరోనా కాలం…. హాస్పిటల్ అంటేనే భయపడే కాలం… అలాంటి వాటిలో పని చేసేందుకు ఎవరు ముందుకు రారు.. అలాంటిది వారు ముందుకు వచ్చారు…. మొదట్లో మీకు ఇన్ని పని గంటలు… ఇంత జీతం అని పనిలో చేర్చుకొని… తీరా పని చేసిన తర్వాత చేతులెత్తేశారు… జీతాలు ఇవ్వకుండా చేతులేత్తేసింది ఎక్కడో ప్రైవేట్ కంపెనీ కాదు… ప్రభుత్వమే… గాంధీ హాస్పిటల్ లో కరోనా కోసం అని కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ని తీసుకున్నారు… రోజుకు 500 రూపాయిల చొప్పున నెలకు…
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శల గుప్పించారు. మంగళవారం ఆయన ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని ఆయన మండిపడ్డారు. 2017-18 నుండి 2021-22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదని ఆయన వెల్లడించారు. ఎంబీసీలకు గడిచిన నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్ విభాగంలో ఆమోదం…
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని ఆయన విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. ఆనాడు…
తెలంగాణలోని ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య యుద్ధమే నడుస్తోంది. యాసంగిలో వరి వేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందే చెప్పినా.. తెలంగాణ బీజేపీ నేతల హామీలతో కొంతమంది వరి వేశారు. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఆరుతడి పంటలు వేసుకున్నారు. తీరా ఇప్పుడు యాసంగి పంట చేతికివచ్చే సమయానికి ధాన్యం కొనుగోలు విషయం చినికి చినికి గాలివానలా మారింది. యాసంగిలో పండించిన పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనుగోలు చేయాలని ఏకంగా రాష్ట్ర…
ఇటీవల సికింద్రాబాద్ తుకారాం గేట్ వద్ద నివసిస్తున్న యువ మహిళా క్రికెటర్ భోగి శ్రావణి తల్లి చనిపోవడంతో, తండ్రి మల్లేష్ తో కలిసి నివసిస్తుంది. అయితే తెరాస నాయకుల ప్రలోభాలకు తలొగ్గి, శ్రావణి ఇల్లు శిధిలావస్థకు చేరిందని బూచి చూపుతూ గ్రేటర్ అధికారులు, శ్రావణి ఇంట్లో సామగ్రిని బయటపడేయడమే కాకుండా, జీఎచ్ఎంసీ అధికారులు ఇంటిని కూల్చివేయడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారిణి శ్రావణికి మద్దతుగా ఆమె ఇంటి ముందు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధర్నా…
మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చివరి నిమిషంలో సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు.…
శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శ్రీ సీతా సమేత జగదభిరాముడి శోభయాత్రను భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనాతో రెండు సంవత్సరాలుగా శోభయాత్ర నిర్వహించలేదు. అయితే రెండేళ్ల తరువాత హైదరాబాద్‌లో రామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగనుంది. సీతారాంబాగ్ నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగునుంది. గంగాబౌలి ఆకాశ్ పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో…
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ తన మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ కూర్పు తుది దశకు చేరుకుంది. గవర్నర్‌కు కొత్త మంత్రుల జాబితాను నేడు పంపనున్నారు. ఆ తర్వాత వ్యక్తిగతంగానూ సీఎంవో అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. 11వ తేదీ ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరిని కొనసాగించాలి.. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేసి, సీఎం జగన్ అన్ని…
టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదు. దానికి పేదవారు…ధనవంతులతో పని లేదు. పట్టుదల..కష్టపడే తత్వం ఉంటే చాలు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జూనియర్ మహిళల హాకీప్రపంచకప్లో అద్భుతంగా ఆడుతున్న ముంతాజ్ కథ అలాంటిదే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముంతాజ్‌ది ఓ నిరుపేద కుటుంబం. ఆరుగురు అక్కా చెల్లెళ్లు..ఒక సోదరుడు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం గడవటానికి తల్లి కైసర్ జహాన్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంది. శుక్రవారం దక్షిణ కొరియాపై ముంతాజ్ విజృంభించి ఆడుతున్న సమయంలో ..ఇక్కడ క్నోలోని…