Bandi Sanjay : అబద్దాల్లో కేసీఆర్‌కు గిన్నిస్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో బీజేపీ ఓబీసీ మోర్చా బీసీ విద్యా వంతుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్దాల్లో, హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ రికార్డు లో చోటు కల్పించవచ్చని ఆయన విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీ కోటాలో కలిపితే వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు. ఆనాడు బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు బీసీ సంఘాల నేతలు పైసలకు అమ్ముడుపోయారని, బీసీ సంఘాలు, కుల సంఘాల నేతలు చెబితే ఓట్లు పడే రోజులు పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. కుల సంఘాలను కేసీఆర్ కలుషితం చేశారని, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్నారు. కుల సంఘాలు చెబితే ఓట్లు పడితే మేం గెలిచేవాళ్ళమే కాదని, 2014లో టీఆర్‌ఎస్ అధికారం చేపట్టిన నాటినుండి బీసీలకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదన్నారు.
రాష్ట్ర జనాభాలో 50 శాతంగా ఉన్న బీసీల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆయన మండిపడ్డారు. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ చేసిన వాగ్ధానాలన్నీ జూఠా మాటలే అని తేలిపోయిందని, దళితబంధు లాగే ‘‘బీసీ బంధు పథకం’’ ప్రవేశపెట్టాలని బీసీలు కోరుతున్నా ప్రభుత్వ చెవులకు ఎక్కడం లేదని, సబ్సిడీ రుణాలకోసం దరఖాస్తు చేసుకొని 5.50 లక్షలమంది గత నాలుగేళ్ళుగా ఎదరుచూస్తున్నారని ఆయన వెల్లడించారు. కాగితాల్లో బడ్జెట్ కేటాయింపులు చేసి అరచేతిలో స్వర్గం చూపుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరణలో బీసీలకు ఖర్చు చేస్తున్నది నామమాత్రమేనని ఆయన తెలిపారు. 2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్ అలంకారప్రాయంగా మారిందని ఆయన విమర్శించారు.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..