తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇసుక సంపదను కర్ణాటకకు చెందిన కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు… తాజాగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామ అ సమీపంలో ఉన్న కాగ్నానది పరివాహక ఈ ప్రాంతంలో పక్కనే ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు ఇసుక వ్యాపారులు తెలంగాణ ప్రాంతంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న బషీరాబాద్ మండలం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో తవ్వకాలు…
ఓవైపు కలలో కూడా వాహనదారులను పెట్రోల్, డీజిల్ ధరలు ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు పెట్రోల్ బంకులు కూడా మోసాలకు పాల్పడుతూ.. సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలతో వాహనాలను రోడ్డుపైకి తీసుకువద్దామంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఆఫీసుకు వెళ్లాలన్నా, నిత్యావసరాలకు బైకో, కారో బయటకు తీస్తే.. బంకుల్లో జరిగే మోసాలకు జేబుల్లో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతోంది. ఇలాంటి ఘటనే హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్…
మాదాపూర్ గుట్టల బేంగంపేట వడ్డెర కాలనీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం 20మంది వాంతులు, వీరేచనాలు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇప్పుడు బాధితుల సంఖ్య 76కు చేరుకుంది. అంతేకాకుండా బాధితులు లో 30 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కలుషిత నీరు తాగడం వలనే అనారోగ్యంకి కారణమని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. అందరూ ఒకే లక్షణాలు తో హాస్పిటల్ లో చేరడంతో కాలనీ వాసుల ఆరోపణలపై ప్రాధాన్యత సంతరించుకుంది.…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతులతో ఆడుకుంటున్నాయని, ఏపీ, కర్ణాటకలో లేని సమస్య తెలంగాణలోని ఎందుకు ఉందని ఆయన మండిపడ్డారు. నేనే ధాన్యం కొంటా అన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఏమి చేయడం లేదని, రూ.1900 మద్దతు ధర దక్కాల్సిన రైతులకు 1300 దక్కుతుందన్నారు. మిల్లర్ లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారని, తెలంగాణలో ధాన్యం…
ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేసారు. కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనుంది. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈసారి కొత్త ముఖాలకు బాగానే చాన్సులు దొరికే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో…
తెలంగాణలో వేసవి తాపం పెరుగుతోంది. దాంతో పాటే రాష్ట్రంలో రాజకీయ వేడి కూడా పెరిగిపోతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్‌ఆర్‌టిపి వంటి అన్ని విపక్ష పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా పాదయాత్రలు, బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఐతే, గత రెండు మూడేళ్లుగా తెలంగాణలో బీజేపీ తన ఉనికిని గట్టిగా…
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి వేడికి ఎన్ని నీళ్లు తాగిన చెమట రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో నీరసం. అయితే ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం ఫ్రూట్ జ్యాస్ తాగుదామని ఓ వ్యక్తి సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు వెళ్లాడు. స్టోర్‌లోని ఫ్రిజ్‌లో నుంచి ఓ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని.. బిల్లు చెల్లించాడు. తీరా ఫ్రూట్ జ్యూస్‌ను ఆస్వాదిద్దామని ఓపెన్ చేసే సరికి ఫ్రూట్ జ్యాస్ బాటిల్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన సదరు వ్యక్తి ఫుడ్…
ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. సహనం పరీక్షించొద్దంటూ పవన్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న మమ్మల్ని రాక్షసులు.. దుర్మార్గలంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడ్డం సరికాదని, వైసీపీ చేసిన తప్పిదాలనే జనసేన మాట్లాడుతోందనే విషయాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తెలుసుకోవాలన్నారు. నేనూ వైసీపీ నేతల కంటే బలంగా మాట్లాడగలనని, నేను విధానాలపైనే మాట్లాడుతున్నానని.. వైసీపీ అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ సమయంలో ఎంతివ్వాలో…
రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం సీబీఐతో విచారణ జరపాలన్న కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదంత ముఖ్యమైన విషయమా..? అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు సైతం విచారిస్తామని, ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రఘురామకృష్ణ రాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన తనయుడు భరత్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్లపై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు…
ఏపీ క్యాబినెట్ విస్తరణకు అడుగులు శరవేగంగా సాగుతున్నాయి. నిన్ననే ఏపీ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై సీఎస్ డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ప్రమాణ…