కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ నెల్లూరు జిల్లా వైసీపీలో సెగలు రేపుతోందా? రివెంజ్ పాలిటిక్స్‌కు తెరలేస్తుందా? ప్లేస్‌లు మారతాయే తప్ప.. వర్గపోరు సేమ్ టు సేమ్ అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయా? ఇంతకీ అక్కడ వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలేంటి? ఎందుకు రుసరుసలు? పుల్ల విరుపు మాటల వెనక కథేంటి? సింహపురి వైసీపీ రాజకీయాల్లో రిటర్న్‌గిఫ్ట్‌లు ఉంటాయా? తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ.. ఆప్యాయత చూపించారో.. సహకారం అందించారో అంతకు రెట్టింపు సహాయ సహకారాలు ఉంటాయని… మంత్రి కాకాణి…
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గత సంవత్సరం పాదయాత్ర ప్రారంభించారు. అయితే నేటి నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి రెండో దశ ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అయితే నేడు డా. బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి దళితుడిని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ, మోడీది అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ స్పూర్తితో…
వేసవికాలం భానుడి తాపానికి ప్రజలందరూ చెమటలు కక్కుతున్నారు. సూర్యోదయం నుంచే కూలర్లు, ఏసీలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే భానుడి భగభగ నుంచి కూల్ చేసే విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రాంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో గంటకు…
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోరస్ మృతులకు ప్రభుత్వం వైపు నుంచి రూ. 25 లక్షలు.. కంపెనీ వైపు నుంచి రూ. 25 లక్షలు నష్టపరిహరం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తీవ్ర క్షతగాత్రులకు…
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు రావు ఇంటి పైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావుతో రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి దాడి చేసి రాళ్లు వేయడంతో ఇంటి అద్దాలు.. కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ… తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు…
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో గల ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో పీజీ స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు యూనివర్సీటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య మొక్కా జగన్నాథరావు వెల్లడించారు. ఈనెల 18 నుండి పీజీ స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్ లలో సైన్స్, ఆర్ట్స్, ఎం.పీ ఈడీ కోర్సులకు సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ ను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సైన్స్ కోర్సులకు ఈ నెల 18వ తేదీన, ఆర్ట్స్ కోర్సులకు 19వ తేదీన…
సర్వదర్శన భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నిన్న శ్రీవారిని 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. కోవిడ్ తరువాత నిన్న రికార్డ్ స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని దర్శించుకున్న 46,400 మంది భక్తులు దర్శిచుకున్నారు. దీంతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు దర్శించుకోగా, వర్చువల్ సేవా టిక్కేట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపులు ద్వారా 16,529 మంది…
సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో 90 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను ఆయా శాఖలకు జారీ చేసింది. ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్…
పదవులు అనేవి కొంచెం కాలమే ఉంటాయని, పుట్టిన ప్రతి మనిషికి ఎప్పుడూ అవే పదవులు శాశ్వతం అనుకోవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పదవి శాశ్వతం అని ఎవరైనా అనుకుంటే అది పగటి కలలు కన్నట్లే అని వ్యాఖ్యానించారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదవులు అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారని, కానీ ప్రజల కోసం పాటు పడినవారే ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్పారు. చనిపోయినా, పదవినుంచి దిగిపోయినా, ఏ పదవీ లేకున్నా…
మరోసారి కరోనా మహమ్మారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు కరోనా ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై విరుచుకుపడి థర్డ్ వేవ్ను సృష్టించింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశాయి. అంతేకాకుండా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ విధించి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందకుండా అరికట్టాయి. అయితే కొత్త కొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్లో సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్…