జోగులాంబ గద్వాల జిల్లా నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉండవెళ్లి మండలం మారమునుగాల దగ్గర బండి సంజయ్ పాదయాత్ర విరామ సమయంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పాదయాత్రలో ప్రజలు కష్టాలు చెప్పుకోవడానికి బీజేపీ పార్టీ వచ్చిందని సంతోషిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలోని యువకులు నిరుద్యోగ…
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ మే 4, 5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. మే 4న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. 5వ తేదీన బోయిన్‌పల్లిలో కార్యకర్తలతో సమావేశమవుతారు. దీంతో రాహుల్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ మదు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గ్రానైట్ వ్యాపారైన ఖమ్మంకు చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను…
గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే ఎన్నో రోజులుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించారన్నారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’. ‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ, మెడ్-టెక్ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తోంది. ఆసియాలోనే అతి పెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన హైదరాబాద్‌లో రెడీ అయ్యిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సూల్తాన్‌పూర్‌లో సిద్ధమైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీ పార్కుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కుని 302 ఏకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రాంగణంలో ఇప్పటికే అనేక కంపెనీలు…
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ లింగన్న గౌడ్‌ను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కరోనాతో మరణించిన వ్యక్తిని స్వయంగా ట్రాక్టర్ పై తీసుకెళ్లి సర్పంచ్ లింగన్న గౌడ్ అంతక్రియలు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ పల్లెలకు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను నిన్న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర పైన మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని.. జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని వ్యాఖ్యలు చేశారు. ‘‘పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు. కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా…
క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. అయితే ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 15న అంటే నేడు క్రైస్తవులందరూ జరుపుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద ఆయన మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక ప్రత్యేక రోజు. పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే ఆచరించబడుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా…
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను అధికారులు భద్రపరచారు. వారిలో ఒకరిని బంధువు గుర్తించడంతో మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ షాక్కు గురయ్యారు. ఓజీహెచ్ మార్చురీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు కేసుల్లో మృతదేహాలను మైలార్దేవ్పల్లి, ఎస్ఆర్నగర్ పోలీసులు మార్చురీకి తీసుకొచ్చి గుర్తింపు కోసం ఉంచారు. అయితే గురువారం ఓ బంధువు వచ్చి ఒక మృతదేహాన్ని గుర్తించడంతో అధికారులు మృతదేహాన్ని కుటుంబ…
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదీలు రీషెడ్యూల్ చేయబడ్డాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ 2022 వెబ్సైట్లో జారీ చేసిన తాజా సర్క్యులర్లో, ఇప్పుడు పరీక్షను ఆగస్టు 28 ఆదివారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బాంబే తేదీలను సవరించింది. గతంలో జులై 3న పరీక్ష జరగాల్సి ఉండగా.. పరీక్ష కింద ఉన్న రెండు పేపర్లను ఒకే రోజు నిర్వహిస్తారు. తొలి టెస్టు…