సంగారెడ్డి పట్టణ కేంద్రంలో దళిత యూనిట్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు దేశానికి ఆదర్శమని కొనియాడరు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు తప్ప ప్రజల అభివృద్ధి అవసరం లేదని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లతోపాటు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దళిత బంధును అమలు చేయండని…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వరం త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి కొనసాగుతుంది. ప్రాణహిత పుష్కరాల 6వ రోజు సందర్భంగా కాళేశ్వరానికి భక్తుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని త్రివేణి సంగమ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. నదిమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.. దీపాలు వదులుతున్నారు. తీరంలో పురోహితులతో పిండ, శ్రాద్ధ కర్మ పూజలు నిర్వహిస్తున్నారు.…
NTV Specials : రాజన్న.. ఈ ‘వీఆర్‌ఏ’ పరిస్థితి ఎందన్న.. పేదల దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల దేవుడు శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోనే ఓ అవమానీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా. రెవెన్యూ విభాగంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ అధికారుల ఆదేశాలతో ప్రతిరోజు ఉదయం వేములవాడలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుభ్రం చేసి తిరిగి తన విధులకు వెళ్తున్నాడు. వేములవాడలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి దాదాపు 10 నెలలు గడుస్తున్నా సిబ్బందిని…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు 5వ రోజు జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మండలంలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతుండగా టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ శ్రేణులు మద్యం సేవించి యాత్రను…
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కమిషన్ అంటోందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి. రంగరావు స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నేను విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు, సూచనల కాపీని పంపిస్తాను. ఆయన చదువుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. రఘునందన్ రావు విద్యుత్ మీటర్ల బిగింపు పై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతానికి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యతో మనిషుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలతో పాటు మైనార్జీలకు…
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కేటీఆర్ శనివారం లేఖ రాశారు. ఈ లేఖలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)ల కేటాయింపులను గురించి కేటీఆర్ ప్రస్తావించారు. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌ల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు ఒక్కటంటే ఒక్క ఎస్టీపీఐని కేటాయించకపోవడం రాష్ట్రం పట్ల కేంద్రం వివక్షేనని ఆయన లేఖలో ఆరోపించారు. రాష్ట్రానికి ఎస్టీపీఐ ఇవ్వకుండా కేంద్రం చూపిన వైఖరితో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని కేటీఆర్…
భారత గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశంలో జరిగిన 49 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, సార్వత్రిక ఎన్నికలలో కూడా హస్తం పార్టీ ప్రదర్శన అధ్వాన్నంగా ఉంది. 2014లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలవటం ఆ పార్టీ దుస్థితికి…
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడవరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బోరవెల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను సీఎం కేసీఆర్ ప్రశాంతంగా ఉండనివ్వడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో…
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన చుట్టూ ఉన్నవారికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అని ముందుంటారు. మొన్నామధ్య ముడిమ్యాల క్యాసారం గేట్ల మధ్య ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదే సమయంలో వికారాబాద్ పర్యటన ముగించుకుని మొయినాబాద్ వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద స్థలం వద్ద తన కాన్వాయ్ అపి క్షతగ్రాతులను ప్రత్యేక వాహనంలో తరలించారు. అంతేకాకుండా ఆ తరువాత ఆ ప్రమాదంలో గాయపడ్డ వారి యోగక్షేమాలపై ఆరా…