మహబూబాబాద్ కౌన్సిలర్ రవిని హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. హత్యతో సంబంధం ఉన్న 7గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో వినయ్, అరుణ్ ప్రధాన నిందితులుగా మిగిలిన ఐదుగురు వారికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్, అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్‌లు నిందితులుగా పోలీసులు వెల్లడించారు. వారి నుండి మారునాయుధాలు గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారును…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 9వ రోజు కొనసాగుతోంది. అయితే పాదయాత్ర వద్ద డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు పాదయాత్ర చేపట్టడంతోనే ఆర్డీఎస్ సమస్యను పరిష్కారించిన ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దక్కుతుందన్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయడం వల్లనే జరిగిందని మోసపూరిత మాట్లాడటం సరిగదాని కర్నూలు, పోలీసులతో అలంపూర్, గద్వాల రైతులు యుద్దవాతవరణం…
స్థానిక మంత్రి పోలీసులపై తీసుకొని వచ్చిన ఒత్తిడి కారణంగా సాయి గణేష్ వాంగ్మూలం రికార్డ్ చేయలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఖమ్మం సంఘటన అందుకు అద్దం పడుతుందని, తెలంగాణలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా పెరిగిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ప్రతిపక్ష పార్టీలు వార్డుల్లో ఖర్చు చేయడం లేదని, అనేక సర్వేలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు. రైతు బంధు…
వరంగల్‌లో రాహుల్‌గాంధీ పర్యటన, సభ నేపథ్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కామెంట్స్‌కు వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు వినయ్ భాస్కర్, అరూరి రమేష్ లు కౌంటర్ ఇచ్చారు. అరూరి రమేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రైతుల ఆత్మహత్యలు జరిగాయని, రైతులకు…
దోపిడీకి వ్యతిరేకంగా అప్పుడు నిజాం నవాబుని తరిమి కొట్టి ప్రపంచానికి చాటి చెప్పిన గడ్డ వరంగల్ అని కాంగ్రెస్ అధిష్ఠానం సూచన మేరకే.. వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పెట్టనున్నట్లు టీపీసీసీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. గురువారం వరంగల్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదు.. రైతుల కోసం పెడుతున్న సభ అన్నారు. సభ విజయవంతం చేసేందుకు ప్రజలే బాధ్యత…
తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బహిరంగ సభను శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. చెన్నూరుకు ఎత్తిపోతల పథకం మంజూరు చేసి మంథని ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం దురదృష్టకరమన్నారు. మంథని ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న…
ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పాగల్ అయిపోయిండా అని చర్చ జరుగుతుందని, మనిషి పిచ్చికుక్కను కలిస్తే కేటీఆర్‌లా అవుతాడని, నాటు వైద్యమే దీనికి మందని ఆయన మండిపడ్డారు. కేటీఆర్‌కి పచెంబ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, ఆముదం తీట కోయిలాకు పూసి పచ్చి చింత బరిగెలతో కొట్టడమే ఆ ట్రీట్ మెంట్…తోలు దొడ్డు అయిందన్నారు. ఎగిరే గుర్రం…
ఉక్రెయిన్ తో యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతున్న వేళ రష్యా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా దీనిని పేర్కొంటున్నారు. ఎలాంటి క్షిపణి రక్షణ వ్యవస్థనైనా ఇది ఛేదించగలదు. క్షిపణి పరీక్ష సూపర్ సక్సెస్ అని ప్రెసిడెంట పుతిన్ స్వయంగాప్రకటించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన ఈ డెడ్లీ మిసైల్ పేరు సర్మత్. రష్యా అమ్ములపొదిలో వున్న కింజల్, అవాంగార్డ్ క్షిపణుల సరసన త్వరలో సర్మత్ చేరనుంది. అప్పుడు రష్యా వైపు చూడాలంటే శత్రువులు…
భానుడి భగభగతో తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఉదయం నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవికాలం ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో తెలంగాణ వాసులు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో ఎండతీవ్రత అంచనాలకు మించి ఉండడంతో విద్యాసంస్థల పనివేళల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి భాగ్యనగరంలో ఉక్కపోతకు ప్రజలు చెమటలు కక్కుతున్నారు. హై స్పీడ్‌లో ఫ్యాన్లు, కూలర్లు,…
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఈ ఆటోలను పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో మెట్రో ఎండీ ఎన్.వి.యస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో హైదరాబాద్ మెట్రో రైల్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వెల్లడించారు. కరోనాకు ముందు రోజుకు 4 లక్షల మంది మెట్రో లో ప్రయాణించే వారని, ప్రస్తుతం రోజుకు 2.7లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణపై కొందరు ఇష్టం వచ్చినంటూ మాట్లాడుతున్నారని, ప్రపంచంలోనే ఇంత పెద్ద మెట్రో…