టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీవీతో జరిగిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయని, మిషన్ భగీరథను అమలు చేస్తున్నాయన్నారు. రైతు బంధును పీఎం కిసాన్ అని, హర్ ఘర్ జల్ కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు నేడు తెలంగాణ దిక్సూచిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 8 ఏళ్లలో బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని,…
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ కాదని, దక్షిణాదిలో బీజేపీ లేదని ఆయన అన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఉందా అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏదో పొరపాటున 4 ఎంపీ సీట్లు గెలిచారన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ చిల్లర రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అని,…
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అపర చాణిక్యుడైన కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ సాయం ఎందుకు కావాల్సి వచ్చిందనే ఎన్టీవీ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాడు 10 సంవత్సరాలు ఉన్న బాలుడు, రాబోయే సంవత్సరం, రెండు సంవత్సరాల్లో ఓటరు కాబోతున్నాడు. ఆ బాలుడికి కేసీఆర్ ఉద్యమ నాయకుడి కాకుండా ముఖ్యమంత్రిగానే తెలుసు అని, జనరేషన్ మారుతున్న కొద్దీ,…
ఆర్మూర్ ఎమ్మెల్య జీవన్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఆదివారంయన నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో జేబులు కట్ చేసి నిజామాబాద్ ఎంపీ బ్లేడ్ బాబ్జీగా మారాడని, అందుకే గొంతు కోసుకుంట అంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అంటేనే బ్రోకర్ల పార్టీ అనీ రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. గతంలో బండ్ల గణేశ్‌కు పట్టినగతే…
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్‌తో పాటు ఆమెభర్త రవి రాణాలు ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి ముందు ఇలాంటివి…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్లు మధ్య పోటీ గట్టిగానే ఉంది. రోజురోజుకు మ్యాచ్‌లలో ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబాయి డీవై పాటిల్ స్టేడియ వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంకుని బరిలోకి దిగగా ఆదిలోని షాక్ తగిలింది. సౌథీ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (5 బంతుల్లో 7; ఫోర్) ఔటయ్యాడు.…
దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న వేళ అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనిచ్చేలా కనిపిస్తోంది. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా త్వరలో ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే శనివారం బస్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారుల కీలక సమావేశం జరిగింది. 9 ఏళ్ల తరువాత ఆర్టీసీ బోర్డ్ తొలిసారి భేటీ కావడం విశేషం. ఈ సమావేశం…
తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన సాయి గణేష్ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. శుక్రవారం ఆయన వైరాలో కమ్మ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరిగింది చిన్నవిషయమే అయినా.. దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు నాపై కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర మంతి వర్గం నుంచి తనను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే పువ్వాడ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు…
వేసవికాలం తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. భానుడి ప్రతాపానికి వేసవికాలం ప్రారంభం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు చెమటలు కక్కుతున్నారు. ఉదయం 9 నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలపై వరుణుడు నిన్న కరుణించి వర్షం కురిపించడంతో ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే ఈ రోజుల కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో…
నిజామాబాద్ టీ-హబ్ ను అమెరికాకు చెందిన వైటల్ గ్లోబల్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధుల, టీఆర్‌ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షులు బిగాల మహేష్ గుప్తా, ఎమ్మెల్యే బిగాల గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా బిగాల గణేష్ మాట్లాడుతూ.. టీ-హబ్ ను అమెరికాకు చెందిన ప్రతినిధులు సందర్శించారని, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ హబ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని, హైదరాబాద్,…