హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఈ ఆటోలను పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో మెట్రో ఎండీ ఎన్.వి.యస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో హైదరాబాద్ మెట్రో రైల్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వెల్లడించారు. కరోనాకు ముందు రోజుకు 4 లక్షల మంది మెట్రో లో ప్రయాణించే వారని, ప్రస్తుతం రోజుకు 2.7లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణపై కొందరు ఇష్టం వచ్చినంటూ మాట్లాడుతున్నారని, ప్రపంచంలోనే ఇంత పెద్ద మెట్రో రైల్ నిర్మాణం లేదని ఆయన పేర్కొన్నారు.
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ జరిగే సమయంలో చాలా మంది ఇది సాధ్యపడే ప్రాజెక్టు కాదంటూ హేళన చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్ని అవరోధాలు వచ్చిన మెట్రో నిర్మాణం పూర్తి చేసి, విజయవంతంగా నడిపిస్తున్నామన్నారు. మెట్రో ఫేస్ 2 మెట్రో నిర్మాణం కోసం ఫోకస్ పెట్టామని, మెట్రో ఫేస్ 2 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు 5వేల కోట్లతో మెట్రో ఫేస్ 2 పెట్టుబడి పెట్టెందు మేము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములైయేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని, ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో ద్వారా 3 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. నష్టాలు వస్తున్న హైదరాబాద్ మెట్రోను మధ్యలో వదిలి వేయకుండా ఎల్అండ్‌టీ నిర్వహణ చేస్తుందని ఆయన తెలిపారు. ఎల్అండ్‌టీ లేకుంటే.. ప్రభుత్వా నికి 20 వేల కోట్లు భారం పడేదని ఆయన పేర్కొన్నారు.