విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా ‘ఎఫ్ 3’ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అందాల సందడి చేసే ఈ సినిమాను, రేపు అంటే ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసినట్టుగా పాటలను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాపై అందరూ మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే.. నేడు చిత్ర యూనిట్ విజయవాడలో సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో తెరపైన పవన్ కల్యాణ్ నటించినట్లు ప్రకటించారు.
అంతేకాకుండా టాలీవుడ్‌లోని టాప్ హీరోలతో ఓ ఎపిసోడ్ ఉంటుందని.. ఆ విధంగా డైరెక్టర్ అనిల్ డిజైన్ చేశారన్నారు. చిన్నపిల్లలకు కోసం కూడా ప్రత్యేకం రెండు ఎపిసోడ్లు ఉంటాయని దిల్ రాజ్ వెల్లడించారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పిటికే ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్‌తో పాటు అగ్రతారలు నటించారని చెప్పడంతో మరింత క్రేజ్ పెరుగనుంది.