నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లు కూడా అదే రేంజ్‌లో కొనసాగుతున్నాయి. ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
READ MORE: Chandrababu: నిర్మలమ్మ బడ్జెట్‌ను స్వాగతించిన చంద్రబాబు.. ప్రగతిశీల బడ్జెట్ అంటూ కితాబు
తన జీవిత భాగస్వామి శోభితాతో అన్ని విషయాలు పంచుకుంటానని నాగ చైతన్య చెప్పాడు. పలు కీలక విషయాల్లో అయోమయానికి లోనైతే.. ఆమె తనకు ఎంతో చేయూతనిస్తుందని తెలిపాడు. పలు సూచనలు కూడా ఇస్తుందని వెల్లడించాడు. తన సతీమణితో జీవితాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. “నాకు తట్టిన ప్రతి ఆలోచనను ఆమెతో పంచుకుంటాను. ఏ విషయంలోనైనా గందరగోళానికి గురైతే.. నా సతీమణికి విషయాన్ని చెబుతాను. నేను ఒత్తిడికి లోనైతే తాను వెంటనే గ్రహిస్తుంది. ఏమైందని జరిగిందంతా తెలుసుకుంటుంది. మంచి సూచనలు సైతం ఇస్తుంది. ఆమె చెప్పే సలహాలు ఇవ్వరినీ ఇబ్బంది పెట్టేలాగా ఉండవు. అందుకే తన నిర్ణయాన్ని ఎల్లవేళలా గౌరవిస్తుంటాను.” అని నాగ చైతన్య స్పష్టం చేశారు.
READ MORE: Samantha: వారిని కఠినంగా శిక్షించాలి.. సమంత పోస్ట్ వైరల్