తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. అయితే మేడారం జాతర హుండీల లెక్కింపును బుధవారం ప్రారంభించారు.
హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. ఇప్పటివరకు రూ.1,34,60,000 ఆదాయం రాగా.. అధికారులు బ్యాంకులో జమ చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు కోటి మందికిపైగా తరలించారు.