వ్యాపారం చేసినవారితో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఇలా ప్రతి ఒక్కరికీ బ్యాంకుతో సంబంధం ఉంటుంది. ఏమైనా లావాదేవీలకు వ్యాపరస్తులు ఖచ్చితంగా బ్యాంకులు అశ్రయించాల్సి వస్తుంది. కొన్ని కొన్ని సార్లు నెలల అధిక సెలవులు రావడంతో బ్యాంకులు రోజుల కొద్ది మూతపడుతుంటాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా భారతీయ రిజర్వు బ్యాంకు 13 రోజులు సెలవులను ప్రకటించింది. కానీ ఏపీ, తెలంగాణతో మాత్రం 8 మాత్రమే మూసుకోనున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెలలో 13 రోజులు సెలవులు ప్రకటించిన్పటికీ.. ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో మాత్రం బ్యాంకులకు 8 రోజులు సెలవులు రానున్నాయి.
మహాశివరాత్రి, హోలీ వంటి ప్రధాన పండుగలతోపాటు రెండు, నాలుగో శనివారం, నాలుగు ఆదివారాలు బ్యాంకులు మూతపడనున్నాయి. నేడు మహా శివరాత్రి, 6న ఆదివారం, 12న రెండో శనివారం, 13న ఆదివారం, 18న శుక్రవారం హోలీ, 20న ఆదివారం, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 8 రోజులు మూతపడనున్నాయి. బ్యాంకులు మూతలో ఉన్నప్పటికీ ఏటీఎం కేంద్రాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు తెలిపారు.