సాక్షి పత్రికలో తనను కించపరుస్తూ కథనాలను ప్రచురించినందున 75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖకు నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. అదానీ డేటా సెంటర్ ముంబై పోయింది… ఒక్క పరిశ్రమ రాలేదు… ఏపీ పెట్టుబడులు ప్రక్క రాష్ట్రాలు లో పెడుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ వారు అంతా గాడిదలు కాస్తున్నారని, వైసీపీ వాళ్ళు ఇక్కడ డబ్బులు దోచుకోని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఆయన అన్నారు. బాబాయ్ హత్యపై జగన్ ఎందుకు స్పందించడం లేదని, ఎందుకు చంపిన వాళ్లను కనిపెట్టడం లేదన్నారు. ఎందుకంటే వాళ్ళే సూత్రధారులు కాబట్టి అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
సీబీఐపై పోలీసులు కేసులు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నానని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా సునీతా రెడ్డి చెప్పారు హత్య వెనుక ఎవరున్నారో అని ఆయన వ్యాఖ్యానించారు. 2019లో చంద్రబాబు చంపారు అన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఎందుకు సీబీఐ విచారణ కోరలేదని ఆయన ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పి ఇప్పుడు రోడ్ల పై తిరుగుతున్నారని, భీమ్లా నాయక్ సినిమా నాకు నచ్చింది అందుకే ట్విట్ చేసానని ఆయన వెల్లడించారు. అన్ని సినిమాలు నచ్చలని లేదని, ఎవరిపై ట్వీట్ పెట్టాలో వాళ్ళు చెప్పాలా అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి ఓటీపీకి ఓటీటీ కి తేడా తెలియదని ఎద్దేవా చేశారు.