తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలల్లో వివిధ సైబర్ మోసాల బాధితులకు రూ.85.05 కోట్లు తిరిగి అందించింది. TGCSB డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ TGCSB , తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (TGLSA) మధ్య సహకార ప్రయత్నమే ఫలితం అని అన్నారు. ఈ ప్రయత్నాలు పెరుగుతున్న సైబర్ నేరాల వెనుక గల కారణాలను , నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్…
వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ కాన్ఫరెన్స్ పలు శాఖలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.
జీవన్‌దాన్‌లో జాతీయస్థాయిలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైన సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అవయవదానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు 14వ ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే (03.08.2024) సందర్భంగా జాతీయస్థాయిలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో…
పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో కలెక్టర్ కాన్పరెన్సులో సీఎం చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. సత్యసాయిబాబా దగ్గర డబ్బుల్లేవు.. అయితే అనంతపురంకు తాగునీరు అందించాలనే తపన ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అందుకే తాను ఓ కాల్ ఇస్తానన్నారు.. ఇచ్చారు దీంతో రూ. 200 కోట్లు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పారు. ఆ వాటర్ ప్రాజెక్టులను తన భక్తులైన ఎల్ అండ్ టీని పెట్టి మెయింటెయిన్ చేయమని ఆయన కోరారని చెప్పుకొచ్చారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మంత్రులు స్పీకర్ గడ్డం ప్రసాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాకుండా.. తాండూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణస్వీకారంలో పాల్గొ్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో అవాకులు చివాకులు తేలడం తప్ప ప్రతిపక్ష నాయకులు చేసిందేమీ లేదని, రైతుల ఆత్మహత్యలు చేసుకోవడానికి వీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి…
విశాఖ రైలు ప్రమాదంపై విచారణను వేగవంతం చేశారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన బోగీలను సాంకేతిక బృందాలు పరిశీలించాయి. ఆర్.డీ.ఎస్.ఓ, ఐ.సీ.ఎఫ్ బృందాలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. క్లూ్స్ టీమ్ కూడా ఆధారాల సేకరణలో నిమగ్నమైంది.
వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్లో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
కేటీఆర్, హరీష్ రావు బావ బామ్మర్దులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణా రావు అన్నారు. కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇంజనీర్లు కాదని, రైతు రుణమాఫీ అనేది చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎవ్వరు ఎంత పెద్ద మొత్తంలో ఋణమాపి చేయలేదని, రుణమాఫీ చేసిన చరిత్ర బీఆర్ఎస్కు లేదన్నారు. 2018-23 ఎంత మందికి రుణమాఫీ చేశారో చెప్పాలని, హెల్ప్ లైన్ పెట్టుకొని…