భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయాన్ని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనమనేని సాంబశివరావు పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి బోటులో కిన్నెరసాని జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టూరిజం హబ్‌గా కిన్నెరసాని, హోలాండ్ తరహలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేవిధంగా ప్రణాళిక చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు అడవులు ఎకో టూరిజానికి అనువుగా ఉన్నాయని తెలిపారు. నేలకొండపల్లి లోని బౌద్ధ స్తూపం మొదలు జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు.
Projects Gates Closed: శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల గేట్లు మూసివేత
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఖిల్లాకు రోప్ వే కావాలన్న డిమాండ్ సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని తెలిపారు. రోప్ వే నిర్మాణానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుమతులు ఇస్తూ వెంటనే సంతకాలు చేశారని, త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించి, కొద్ది నెలల్లోనే పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇతర చిన్న దేశాలు. అమెరికా లాంటి ప్రాత్యాయత గల దేశాలు టూరిజం ద్వార టూరిజం వల్ల అభివృద్ధి చెందాయని, జిల్లాలో కిన్నెరసాని జలాశయం టూరిజం అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందన్నారు. ఇటువంటి ప్రకృతి వాతావరణం మధ్య పర్యాటకులకు వసతులు కల్పించే దిశగా రూపాకల్పన చేయిస్తామన్నారు.
Bangladesh: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి సందేశం