సచివాలయంలో జలాశయాల పూడిక తీత పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాలికతో…
ఏపీ చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్వాక్రా మహిళల ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయించే అంశంపై చర్చించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది.
మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం రాంపూర్ గ్రామంలో సరస్వతి విద్యా మందిర్ నూతన భవన నిర్మాణానికి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ పరిణామాలపై అవగాహన లేకపోతే విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది.. బంగ్లాదేశ్ లో సంక్షోభమే నిదర్శనమన్నారు. దేశభక్తి, ధర్మాన్ని బోధించడంతోపాటు దేశ పరిణామాలపై చర్చలో శిశు మందిర్ భేష్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో నక్సల్ భావజాలం…
సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో తాగుబోతు 108 సిబ్బందికి చుక్కలు చూపించాడు. తీవ్ర జ్వరం వచ్చిందని, హాస్పిటల్ కి వెళ్లాలని 108కు ఫోన్ చేశాడు పరుశరాములు. చెప్పిన అడ్రస్ కు వచ్చిన 108 సిబ్బంది.. రాగానే ఫోన్ చేయగా.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురయ్యారు 108 సిబ్బంది. 108 సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేయడంతో బాధితుడి కోసం ఆరా తీశారు 108 సిబ్బంది. ఫోన్ చేసిన సదర్ కాలర్ ను…
రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ ను నిందించడం కేటీఆర్ కే చెల్లిందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని, మహిళా భద్రతకి మేము పెద్ద పీట వేస్తున్నామన్నారు. నేరాలకు కారణం అవుతున్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై ఉక్కు పాదం మోపామని, ఎనిమిది నెలల తర్వాత మహిళలపై అఘాయిత్యాలు మాకు గుర్తుకువచ్చాయని కేటీఆర్ చెప్పడం ఆయన అజ్ఞానానికి అద్దం…
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో మంకీ ఫాక్స్ పై ముందస్తు, నివారణ చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో దేశంలో ఢిల్లీ కేరళ రాష్ట్రాలలో స్వల్ప కేసులు 15+15(30) నమోదు అయ్యాయని మంత్రి దామోదర్ నరసింహ గారి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు…
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్ భవనాల నిర్మాణాల కోసం ఆయా నియోజకవర్గాల్లో కావలసిన స్థలాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని స్థలాన్ని సేకరించి డిజైన్స్ వేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వార్షిక సంవత్సరం రూ. 5 వేల కోట్లతో 30 కాంప్లెక్స్ లో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఎస్సీ…
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు.