వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో అమెరికా టైమ్ స్క్వేర్ లో జగన్ చిత్రపటంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 560 కిలోల కేక్ తయారు చేసిన యునైటెడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ సంస్థ.. పార్టీ నేతలతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి.. మన కాళ్ళపై మనం నిలబడే విధంగా ప్రజల జీవితాల్లో పూర్తి మార్పు తీసుకుని రావటం అంత తేలిక కాదు.. దీన్ని చేసి చూపించిన వ్యక్తులు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ కే సాధ్యం అని ఆయన చెప్పారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ ఎదగటం గర్వ కారణం.. వైఎస్ఆర్ కన్న కలలను నిజం చేస్తున్న వ్యక్తి జగన్ అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Read Also: Gutur Kaaram: కొరటాల శివతో వర్క్ చేయకముందు ఉండే మహేష్ ని చూస్తారు…
ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా బతికగలిగే అవకాశం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రజలకు ఏం చేయనవసరం లేదు.. చేసినట్లు నటిస్తే చాలు అని భావించే వ్యక్తి చంద్రబాబు.. మీడియాను అడ్డం పెట్టుకుని ఏదో చేసినట్లు ప్రజలకు భ్రమ కల్పించవచ్చని చంద్రబాబు భావిస్తారు.. ఉన్న డబ్బులు కాంట్రాక్టర్లకు దోచి పెట్టి దానిలో నుంచి తన వాటా తీసుకోవచ్చన్నది చంద్రబాబు వైఖరి.. జగన్ కు ఇవి చేతకావు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదరికం 11 నుంచి 5 శాతానికి తగ్గించటంలో పేదల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధి అర్థం అవుతుంది.. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా.. వనరులను పేదలకు పంచి పెట్టడం వల్లే ఆర్ధిక వ్యవస్థ నిలబడింది.. మూడు లక్షల కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రజలకు అందించారు అని సజ్జల చెప్పుకొచ్చారు.
Read Also: Prabhas : పోలీస్ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో రెబల్ స్టార్..!
గతంలో లాగా జన్మభూమి కమిటిల వేధింపులు లేవు అని సజ్జల తెలిపారు. జగన్ పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు.. ఎన్నికలు రాగానే మారీచ శక్తులు కలిసి వస్తున్నాయి.. ప్రజలకు చంద్రబాబు చేసింది మోసమే.. ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను బలవంతంగా తీసుకుని వచ్చారు.. జగన్ ను గద్దె దించటం పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం.. ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూస్తున్నారు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని ఆయన చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు కోసం చేస్తున్న యజ్ఞం కొనసాగాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వం రావాలి అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.