సినీ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ట్రై చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు మనోజ్. తన సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు ఓ…
బడుగు, బలహీన వర్గాల స్థితిగతులు పెంచేందుకు జగన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పేదల విద్యార్థులు బాగుండాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంలో తీసుకువచ్చారని.. చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు.. వాళ్ళ బంధువులు చదవచ్చు.. కానీ బడుగు వర్గాల పిల్లలు మాత్రం చదువుకోకూడదని న్యాయస్థానాలకు వెళ్ళాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
అన్ని వర్గాల అవసరాలను తీర్చే పాలనను ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పేర్కొన్నారు. వైఎస్సార్ కంటే రెండడుగులు ముందుకు వేసి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. ఎలాంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ వారి ఖాతాల్లో నేరుగా లబ్ధిని అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక సంక్షోభం అలాగే 2023లో ఎదురైన కొన్ని క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రముఖ కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. ఏ రంగాలకు ఎలా ఉన్నా.. టెక్ కంపెనీలకు, స్టార్టప్‌లకు కొంత నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ ఏడాదంతా కూడా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. దేశంలో ఎన్ని స్టార్టప్ కంపెనీలు ఎంతమంది ఉద్యోగులను తొలగించాయి.. నిన్న ప్రముఖ కంపెనీ పేటీఎం…
భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం తీవ్రంగా పరిగణించినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. న్యూ మంగళూరు ఓడరేవుకు వస్తుండగా అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిజ్ఞ చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లో సైన్యంపై ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాల ప్రకారం.. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు సైన్యంపై దాడి చేయడానికి చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు అసంతృప్తి గళం విప్పుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఎమ్మెల్యీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది.
బుల్లితెర సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల ఆదరణ పొందాడు.. బిగ్ బాస్ లో కూడా .. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని ఫ్యాన్స్…
కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం బిల్లులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.