బుల్లితెర సీరియల్ నటుడు మానస్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించి జనాల ఆదరణ పొందాడు.. బిగ్ బాస్ లో కూడా .. ఇలా అందరికీ మానస్ సుపరచితమే.. వెండి తెరపై బాలనటుడిగా పరిచయం అయిన మానస్.. హీరోగా గోళీసోడా వంటి కొన్ని ల్లో నటించాడు. అనంతరం కోయిలమ్మ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టాడు. అయితే మానస్ కు వెండి తెరపై కంటే బుల్లి తెర ప్రేక్షకుల ఆదరణ అధికం.. ఇక ఇటీవలే శ్రీజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు.. ఆ పెళ్లికి సంబందించిన ఫోటోలు ఇంక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
మొన్న పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా ఖరీదైన బెంజ్ కారు కొనేశాడు. ఇంతకీ ఆ కారు రేటు ఎంతంటే? ‘కాయ్ రాజా కాయ్’, ‘ప్రేమికుడు’ తదితర సినిమాల్లో మానస్ హీరోగా నటించాడు. కానీ బిగ్ స్క్రీన్ పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ 5వ సీజన్‌లో పాల్గొని ఫినాలే వరకు వచ్చాడు కానీ విజేతగా నిలవలేకపోయాడు. అయితేనేం ఫేమ్ తెచ్చుకున్నాడు.. ఇక ఇప్పుడు ఆయన కొన్న కారు ధర, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. బెంజ్ ఎఫ్220డీ కారుని కొనుగోలు చేశాడు.
ఇక ఇదే విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ కారు ఖరీదు.. దాదాపు రూ.85-90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా సరే మొన్నే పెళ్లి చేసుకుని, ఇప్పుడు కారు కూడా కొనేశాడు. అదిరిందయ్యా మానస్ అంటూ సన్నిహితులు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ గా తన నటనతో అందరి మనసులను గెలుచుకున్నాడు మానస్.. తన పాత్ర కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలో చూపిస్తుంది.. ఆ క్యారక్టర్ జనాలకు విపరీతంగా నచ్చేసింది..