లోక్ సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.., బీఅర్ఎస్ చిత్తుగా ఓడటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8మంది ఎమ్మెల్యే లు గెలవడంతో అసలు విజయం బీజేపీదేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఅర్ఎస్, కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు కాదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచిందని ఆయన ఆరోపించారు. బీఅర్ఎస్ నాయకుల…
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారన్నారు. 150రోజులు 4వేలకు పైగా కిలోమీటర్లు రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని, భారత్ జోడో యాత్ర స్పూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సీఎం రేవంత్. కర్ణాటక తరువాత జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది…. తెలంగాణలోనూ కాంగ్రెస్…
డిసెంబర్ 30న ప్రారంభించనున్న అయోధ్యలోని విమానాశ్రయానికి 'మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్'గా నామకరణం చేశారు. ఈ విమానాశ్రయానికి రామాయణ పురాణ రచయితగా ప్రసిద్ధి చెందిన పురాణ కవి వాల్మీకి పేరు పెట్టారు.
కన్నడ అనుకూల సంస్థలు సైన్‌బోర్డ్‌లు, నేమ్‌ప్లేట్లు, ప్రకటనలపై కన్నడ భాషను ప్రదర్శించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకస్మికంగా సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ.. సైన్‌బోర్డ్‌లో 60 శాతం కన్నడలో ఉండాలని ఆయన తెలిపారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం లోఅమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణలో 35శాతం ఓట్ల తో 10 పార్లమెంటు సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు నుంచి 8కి వచ్చామన్నారు అమిత్ షా. ఇది వచ్చే ఎన్నికల్లో 64కావచ్చు .. 95 కూడా కావచ్చు అని, తెలంగాణలో భవిష్యత్తు…
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2024 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫిబ్రవరి 28, 2024 నుండి ప్రారంభం కానుండగా.. రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29, 2024 నుండి ప్రారంభమవుతాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం విద్యార్థులకు షెడ్యూల్ ఇంటర్మీడియట్…
15 ఎంపీ స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నామని, నేను ఎంపిగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. ఇవాళ ఆయన ఎన్టీవీతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ వద్దని చెబుతుంది… పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ లో చేరేందుకు సోయం బాపు రావు చర్చలు జరిపారన్నారు. పార్లమెంట్…
యూరప్‌కు ముఖద్వారమైన ఇటలీ భారతీయులకు తలుపులు తెరిచింది. భారత్, ఇటలీ ఇటీవల 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ' ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి భారత మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటలీతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందాలను బలోపేతం చేయడమే కాకుండా అక్రమ వలసలను కూడా నిరోధించనుంది.
ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేయగలరా.. అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్‌పై సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది.