రాజన్న సిరిసిల్ల మున్సిపల్ లో 7 విలీన గ్రామాలపై సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మున్సిపల్‌లో విలీన గ్రామాలపై మతి భ్రమించి తీర్మానం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల కాకముందే రెండు పతకాలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 7 విలీన గ్రామాల ప్రజలు అభిప్రయాలు తీసుకోకుండా మంద బలం తో మున్సిలిపల్ లో కలిపారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. విలీన గ్రామాల కలిపి వారు ఉపాధి కోల్పోయిన వారికి ఎం సమాధానం ఇస్తారని, విలీన గ్రామాల నుండి ఇద్దరు చనిపోయిన కూడా వారి కి కనీసం వారిని పరామర్శించలేదన్నారు. చనిపోయిన ఇద్దరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని, గత ఎన్నికల్లో నేను హామీ ఇచ్చినా తర్వాత మున్సిపల్ లో తీర్మానం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. నేను ఓడిపోయినా మా ప్రభుత్వం పంచాయితిలుగా మారుస్తమని హామీ ఇచ్చిన. ఆటో కార్మికులను కూడా ఆదుకుంటాం సంవత్సరానికి 12 వేయిలు ఇస్తాం. కొందరు అనాలోచిత నిర్ణయాలతో మా ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే మాపై ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు పొలిమేర దాకా తరిమి కొడతారు. గత ప్రభుత్వం ఎందుకు విలీన గ్రామాలను ఎందుకు పంచాయితీ లు గా మార్చలేదు. కొందరి స్వలాభం కోసం విలీనం చేశారు.
సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ మాటలు నమ్మే స్థితిలో సిరిసిల్ల ప్రజలు లేరు. పాలిస్టర్, కాటన్ పరిశ్రమను, కార్మికులను ఆదుకుంటూ సిరిసిల్లకు పునర్వవైభవం తీసుకొస్తాం. కేటీఆర్ అధికారం లో ఉన్నప్పుడు కరెంటు సబ్సిడీ కొరకు ఎందుకు మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్ర అభవృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుతున్న. చిల్లర మాటలు, చేస్టలు చేస్తే ఊరుకునేది లేదు. కేటీఆర్ ప్రజల సమస్యల కొరకు పోరాటం చేయు. మాది ప్రజా పాలన, గడిల పాలన కాదు. ప్రజ పాలన కొరకు మేము ప్రజల్లోకి వెళుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరకీ సమాన న్యాయం చేశాం. కేటీఆర్ అక్రమాల ద్వారా గెలిచి చిల్లర మాటలు, విమర్శలు చేయడం తగదని దయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉంది.’ అని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.