Asia’s richest person: అత్యంత ధనవంతుడిగా అదానీ.. అంబానీ స్థానం ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కొత్త ఏడాదిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉండగా.. అదానీ నికర విలువ 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 97 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచంలో 13వ స్థానానికి దిగజారిపోయారు. గౌతమ్ అదానీ కంటే ముందు ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా ఉన్నారు.
Read Also: Harirama Jogaiah Open Letter: పవన్ కల్యాణ్‌కు మరోసారి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. ఇలా చేయండి..!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఇక, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని టాప్ -20 బిలియనీర్లలో ముగ్గురి నికర విలువ మాత్రమే పెరిగినట్లు చెప్పింది. వీటిలో అదానీ, అంబానీలే కాకుండా అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ కూడా ఉన్నారు. గౌతమ్ అదానీ నికర విలువలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. అతని సంపద 24 గంటల్లో 7.6 బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూమ్ బెర్గ్ పేర్కొనింది.
Read Also: Naa Saamiranga: ఈ సాంగ్ ఇంత ఎమోషనల్ గా ఉందేంటి?
అయితే, అదానీ గ్రూప్‌కు చెందిన పది లిస్టెడ్ కంపెనీలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపు 65,500 కోట్ల రూపాయలను జోడించింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలపై విచారించిన సుప్రీం కోర్టు గౌతమ్ అదానికి అనుకులంగా తీర్పు ఇవ్వడంతో.. ఒక్కసారిగా ఆ కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపించింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకరోజు క్రితం రూ.14.47 లక్షల కోట్ల నుంచి బుధవారం నాటికి రూ.15.11 లక్షల కోట్లకు పెరిగిపోయింది. దీంతో ముఖేష్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో తొలి స్థానాన్ని గౌతమ్ అదానీ దక్కించుకున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!