కాజీపేట-బల్హర్షా విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే (SCR) హసన్పర్తి రోడ్-ఉప్పల్ మధ్య 12.7 కి.మీ మేర విద్యుదీకరణతో పాటు మూడవ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించింది. కాజీపేట – బల్హర్షా మధ్య ఉన్న సెక్షన్ దేశంలోని దక్షిణ ప్రాంతంతో ఉత్తర ప్రాంతాలను కలిపే గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న ఒక ముఖ్యమైన రైలు లింక్. దీంతో ఈ ప్రాజెక్టు కింద గతంలో పూర్తయిన రాఘవాపురం-మందమర్రి సెక్షన్‌తో కలిపి ప్రస్తుతం మొత్తం 131.7 కి.మీ.…
సంక్రాంతి సంబరాల్లో గాలిపటాలు ఎగురుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్తు అంతరాయం ఏర్పడితే, టోల్ ఫ్రీ మరియు కాల్ సెంటర్ నంబర్లలో విద్యుత్ సరఫరా ఫిర్యాదులను నమోదు చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL ) వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. , మొబైల్ యాప్‌లో మరియు సోషల్ మీడియాలో. TSSPDCL ప్రకారం, వినియోగదారులు తమ ఫిర్యాదును విద్యుత్ సమస్య కాల్ సెంటర్ నంబర్ 1912, X (@tsspdclcorporat), Facebook (gmcsc.tsspdcl),…
ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు జోరుగా జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాల కోలాహలం కొనసాగుతోంది. బరుల్లో కోడిపుంజులు పందానికి కాలు దువ్వుతున్నాయి.
ఇటీవల సినిమాలు విడుదల అవ్వక ముందే ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేస్తున్నారు.. భారీ ధరకు సినిమాను కొంటున్నాయి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. మరోవైపు ఓటీటీ లో బోలెడు సినిమాలు విడుదల అవ్వడంతో సినీ ప్రియులు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ సినిమా ఏంటో ఒకసారి చూసేద్దాం.. ఈ…
ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌లో సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.16,320 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎనిమిది మంది వ్యక్తులు వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో కోడి పందాలు నిర్వహించి అందులో పాల్గొన్నారు. టాస్క్‌ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. పోలీసుల నిషేధం మరియు హెచ్చరికలు ఉన్నప్పటికీ సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడులో విస్తృతంగా ప్రబలంగా…
మద్యం మత్తులో ఎన్నో గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు కుటుంబాన్ని చీల్చితే మరికొన్ని కొన్ని గొడవలు మాత్రం ప్రాణాలను తీస్తున్నాయి.. ఇటీవల అలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. మటన్ తినే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. దాంతో మొదట మాటలతో మొదలైన గొడవ కాస్త కత్తితో పొడుచుకొని చనిపోయే వరకు వచ్చింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల…
రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్ లుగా బీజేపీ చేసింది. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇంఛార్జి గా బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుండి క్లస్టర్ ఇంఛార్జి లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన…
దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్లు సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దొంగ ఓట్లు చేర్చడం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై ధర్నా చేస్తున్న సమయంలో గాయపడిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు.
గత కొద్ది నెలలుగా పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మాంద్యం కారణంగా తీవ్ర నష్టాల పాలయ్యింది. దీని కారణంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తులు పెరిగి గోదాముల్లో నిలువలు పెరుకుకుపోయాయి. దీంతో పాటు హైదరబాద్ తదితర మార్కెట్లలో ఫాలిస్టర్ వస్త్రాల అమ్మకాలు తగ్గిపోవడంతో కార్మికులకు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సభ్యులకు పని కల్పించలేక, సకాలంలో జీతాలు అందించలేక 15వ తేదీ నుండి ఫ్యాక్టరీలను మూసి వేయాలని తలంచారు.. ఈ విషయాన్ని అధికారులు రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, మార్కెటింగ్ శాఖా మంత్రి…