మద్యం మత్తులో ఎన్నో గొడవలు జరగడం కామన్.. కొన్ని గొడవలు కుటుంబాన్ని చీల్చితే మరికొన్ని కొన్ని గొడవలు మాత్రం ప్రాణాలను తీస్తున్నాయి.. ఇటీవల అలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. మటన్ తినే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. దాంతో మొదట మాటలతో మొదలైన గొడవ కాస్త కత్తితో పొడుచుకొని చనిపోయే వరకు వచ్చింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్ తుకారాం గేటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.. వివరాల్లోకి వెళితే.. గోల్‌బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ మంచి స్నేహితులు.. అయితే మందేస్తూ, మటన్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే మటన్ తినే విషయం జరిగిన చిన్న గొడవ హత్యకు దారి తీసింది..
అప్పటికే మద్యం తాగేసి ఉన్నారు. మాటలతో మొదలైన గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో అజయ్ కత్తితో చారిపై దాడి చేశాడు. చారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..