తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫిక్స్ చేసింది. వారిద్దరికీ ఫోన్ చేసి, నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18తో నామినేషన్ల గడువు ముగియనుంది. 29న పోలింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో సంఖ్యాబలం కారణంగా కాంగ్రెస్ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్…
రేపు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశం ఉందని తెలిపారు ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ విభాగం చేసిన పనితీరు.. పార్లమెంట్ ఎన్నికలకు అదేవిధంగా పనిచేయాలి దిశ నిర్దేశం చేయడమే అజెండా అని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని, జనాభా లెక్కలు కులాల వారీగా కేంద్రం చెప్పటం లేదని బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ఆ లక్ష్యం తోనే…
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ అందరినీ ఆకర్షిస్తోంది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాన్ని చాటేలా రూపొందించిన ఈ వేదిక అందరినీ ఆకర్షిస్తోంది. మన బతుకమ్మ, బోనాల పండుగలు, మన చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నంగా నిలిచిన చార్మినార్… మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం…
సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ డైరెక్టర్ అగ్రికల్చర్ తో సమీక్ష నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో నమోదైన యూరియా కొరతకు సంబంధించిన సమస్యలను సమీక్షించారు. దీనిపై వ్యవసాయ సంచాలకులు వివరిస్తూ ఇట్టివాళ్ళ జరిగిన లారీల సమ్మె కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, వారి సమ్మె నిష్కరించడంతో. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మిర్చి ధర, తెగుళ్ల నియంత్రణ చర్యలలో ఇటీవల మార్కెట్ సంబంధిత సమస్యల గురించి సమీక్షించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటల…
మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో మల్లేష్ ఆనే బీఆర్‌ఎస్ కార్యకర్తది రాజకీయ హత్య కాకపోతే.. జూపల్లి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు సరైన రీతిలో విచారణ చేయడం లేదన్నారు హర్షవర్ధన్ రెడ్డి. మల్లేష్ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను సచివాలయంలో పక్కన కూర్చో పెట్టుకుని…
ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట అయోధ్య రామ మందిరం.. జనవరి 22న జరిగే రామాలయ ప్రతిష్ఠాపన ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అసాధారణమైనది.. అయోధ్య నగరమంతా సర్వాంగ సుందరంగా తయారవుతోంది. ప్రభుత్వ యంత్రాంగం యూనిఫాం కలర్ కోడ్, యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తూ.. చారిత్రక వైభవం, సంస్కృతి ప్రతిబింబించేలా అయోధ్యలోని భవనాలను తీర్చిదిద్దుతోంది.. ఈ ప్రతిష్ఠాపన సమయంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందిస్తున్నారు..…
కోరుట్ల పట్టణంలో సోమవారం గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమునిదుబ్బ ప్రాంతంలో తమ ఇంటి డాబాపై ఇద్దరు చిన్నారులు తోకల సాత్విక్, ప్రశాంత్ గాలిపటం ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే దారం విద్యుత్ తీగలలో ఇరుక్కుపోయింది. తీగలలోని దారాన్ని తీసేందుకు ప్రయత్నించగా, బాలురు విద్యుత్ వైరుకు తగిలి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి…
దక్షిణ కొరియాతో ఇకపై ఏకీకరణ సాధ్యం కాదని అన్నారు. దక్షిణ కొరియాను ప్రత్యేక 'శత్రువు దేశం'గా మార్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కిమ్ జోంగ్ ఉన్ పిలుపునిచ్చారు.