రేపు ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ
సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్ లుగా
బీజేపీ చేసింది. ఒక్కో క్లస్టర్ కి ఒక్కో నేతకు ఇంఛార్జి గా బాధ్యతలు అప్పగించనుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుండి క్లస్టర్ ఇంఛార్జి
లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అటెండ్ కానున్నారు. ఎల్లుండి
నుండి బీజేపీ అభ్యర్థులుగా అసెంబ్లీకి పోటీ చేసిన వారితో సమావేశాలు నిర్వహించనున్నారు.
సమావేశాలను చింతల రామ చంద్ర రెడ్డి
ఆర్గనైజ్ చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ లను విభజించింది బీజేపీ. ఎల్లుండి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులతో భేటీ కానున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తయారు, పార్టీ లో చేరికలు, సంస్థాగత అంశాల పై చర్చించనున్నారు. చేరికల కమిటీ వేసిన బీజేపీ ఆ కమిటీ
సమన్వయ కర్త గా చింతల రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో త్వరలో రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో అధికస్థానాలు సాధించేందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు.. బీఆర్‌ఎస్ నేతలు సైతం పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉన్నారు.