ఇటీవల సినిమాలు విడుదల అవ్వక ముందే ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేస్తున్నారు.. భారీ ధరకు సినిమాను కొంటున్నాయి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు.. మరోవైపు ఓటీటీ లో బోలెడు సినిమాలు విడుదల అవ్వడంతో సినీ ప్రియులు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు.. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. ఆ సినిమా ఏంటో ఒకసారి చూసేద్దాం..
ఈ సంక్రాంతికి సినిమాల సందడి మాములుగా లేదని చెప్పాలి.. థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘హను-మాన్’ మూవీ విజేతగా నిలిచింది. మిగతా మూడు చిత్రాలతో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితేనేం ఎవరికి ఏ చిత్రం అందుబాటులో దాన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్‌కి వెళ్లే ఓపిక లేని వాళ్లు మాత్రం ఓటీటీల వైపు చూస్తున్నారు. రీసెంట్‌గా ‘డెవిల్’ మూవీ ఓటీటీలోకి వచ్చింది.. ఇప్పుడు మరో మూవీ యాడ్ అయ్యింది..
చిన్న మూవీగా వచ్చిన ‘#మాయలో’ అనే తెలుగు మూవీ కూడా ఓటీటీ లో విడుదలైంది.. అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.. డిసెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ సినిమాలో పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. అయితేనేం ఈ పండక్కి టైంపాస్ కావాలంటే కొత్తగా వచ్చిన ఈ మూవీ పై ఒక లుక్ వెయ్యండి.. ఇక ఈ వారం ఓటీటీ లో ఏకంగా 45 సినిమాలు విడుదల అవుతున్నాయి..