Thane court: 2017లో జరిగిన జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యతో సంఘ్‌కు సంబంధం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి థానే కోర్టు 500 రూపాయల జరిమాన విధించింది. అయితే, వ్రాతపూర్వక ప్రకటనను దాఖలు చేయడంలో రాహుల్ గాంధీ 881 రోజులు జాప్యంపై క్షమాపణ కోరుతూ అతని తరపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ ఒక దరఖాస్తును దాఖలు చేశారు.
Read Also: Khalistani Terrorist: అయోధ్యలో విధ్వంసం సృష్టస్తాం.. సీఎంను చంపేస్తాం..
అయితే, రాహుల్ గాంధీ ఢిల్లీ నివాసి అలాగే ఆయన ఒక ఎంపీ కాబట్టి తన నియోజకవర్గంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుంది.. అందువల్ల ఆయన సకాలంలో వ్రాతపూర్వక ప్రకటనను దాఖలు చేయలేకపోయారని ఆయన న్యాయవాది నారాయణ్ అయ్యర్ కోర్టులో సమర్పించారు. ఇక, రాహుల్ గాంధీపై కేసును ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్ వివేక్ చంపానేర్కర్ తన లాయర్ ఆదిత్య మిశ్రా ద్వారా దాఖలు చేశారు. రాహుల్ గాంధీ దరఖాస్తును ఆర్ఎస్ఎస్ తరపు లాయర్ మిశ్రా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకుడి ఈ ఇష్యూను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also: Richest Family: వరల్డ్ రిచెస్ట్ ఫ్యామిలీ.. 700కార్లు, రూ.4000కోట్ల ఇల్లు, 8జెట్లు.. అంతులేని సంపద
ఇక, రాహుల్ గాంధీ చేసిన ఆలస్యానికి థానే కోర్టు 500 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసును ఫిబ్రవరి 15న మరోసారి విచాణ చేస్తామని కోర్టు తెలిపింది. అప్పుటి వరకు రాహుల్ గాంధీ వ్రాతపూర్వక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తుంది అని కోర్టు పేర్కొనింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం.. పరువు నష్టం అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోర్టు ముందు తన రక్షణగా వ్రాతపూర్వక ప్రకటనను సమర్పించాలి ఉంటుంది. వ్రాతపూర్వక స్టేట్‌మెంట్ దాఖలు చేసిన తర్వాత సాక్షులను ప్రశ్నించడంతో పాటు క్రాస్ క్వశ్చన్ చేయడం ప్రారంభమవుతుంది. అయితే, మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు మార్చి 2023లో ఆయనను దోషిగా నిర్ధారించింది.. దీంతో లోక్‌సభ ఎంపీగా కూడా సస్పెండ్ చేయబడ్డాడు.. అయితే సుప్రీం కోర్టు శిక్షపై స్టే విధించడంతో తన ఎంపీ పదవిని తిరిగి పొందాడు.