భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న కీలక పరిణామం జరిగింది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం అయింది. ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నాయి. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహ్మద్ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి భారత్- మల్దీవుల మధ్య దూరం పెరిగుతుంది. ఈ క్రమంలోనే మార్చి 15నాటికి తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవలే గడువు పెట్టాడు. ఇక, గతేడాది డిసెంబరులో భారత ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో సందర్భంగానూ మహ్మద్ ముయిజ్జూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ సమస్య పరిష్కారానికి ఇరు దేశాలకు కోర్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Read Also: Plane Crash : అమెరికాలోని ఫ్లోరిడాలో విమాన ప్రమాదం.. పైలట్‌తో సహా ముగ్గురు మృతి
ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఈ కోర్ కమిటీ మాలెలో సమావేశం అయ్యింది. తాజాగా ఢిల్లీలో రెండో సారి సమావేశం నిర్వహించింది. ఈ అంశంలో పరస్పర ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని కనుగొనడంపై ఇరు దేశాలు నజర్ పెట్టాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌కు చెందిన దాదాపు 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం మల్దీవుల్లో ఉంది. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీ కాస్తున్నాయి.